రేవంత్ కు షాకివ్వబోతున్న చంద్రబాబు ? అధికారులకు కీలక ఆదేశం..!
ఏపీ-తెలంగాణలో గత ఏడాది కాలంలోనే ప్రభుత్వాలు మారాయి. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య గతంలో ఉన్న స్దాయి మనస్పర్ధలు కూడా తగ్గాయి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిసి పనిచేయకున్నా ఇప్పటివరకూ ఎలాంటి విరుద్ధ ప్రకటనలు చేసుకోవడం కానీ, నిర్ణయాలు తీసుకోవడం కానీ చేయడం లేదు. కానీ తెలంగాణలో రేవంత్ సర్కార్ పై విపక్షాల నుంచి జల వివాదాలపై పెరుగుతున్న ఒత్తిడి ప్రభావం పరోక్షంగా ఏపీలో చంద్రబాబు సర్కార్ పైనా పడుతోంది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు ఓ విషయంలో అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. రేపు హైదరాబాద్ లో కృష్ణా రివర్ బోర్డు సమావేశం జరగబోతోంది. ఇందులో ఏపీ, తెలంగాణకు చెందిన జలవనరుల శాఖ అధికారులు హాజరు కాబోతున్నారు. కృష్ణా నది మిగులు జలాల్ని ఏపీ వాడుకునే విషయంలో తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ బోర్డు సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మీటింగ్ లో పాల్గొనేందుకు వెళ్తున్న ఏపీ అధికారులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు.

వృథాగా సముద్రంలో పోతున్న నీటిని ఏపీ వాడేసుకుంటుందంటూ తెలంగాణలో రాజకీయ పార్టీలు, అధికారులు వాదిస్తున్న నేపథ్యంలో ఈ వాదనను సమర్ధంగా తిప్పికొట్టాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. వరద జలాల్ని వాడుకుంటే తప్పులేదన్న వాదన వినిపించాలని సూచించారు.
అలాగే శ్రీశైలం ప్రాజెక్టులో నీటికి సాకుకు అవసరం లేకపోయినా వదిలేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపైనా గట్టిగా వాదించాలని చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. దీంతో రేవంత్ సర్కార్ వాదనను తిప్పికొట్టేలా రేపు ఏపీ అధికారులు కేఆర్ఎంబీ భేటీలో వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు.












Click it and Unblock the Notifications