విజయవాడ, గుంటూరులో పేదలకు చంద్రబాబు బిగ్ న్యూస్..!
ఏపీలో తాజాగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతిపై వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయాన్ని రద్దు చేసి అందులో మార్పులు చేసి అమలు చేయాలని నిన్న కలెక్టర్ల భేటీలో సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. త్వరలో అధికారులు దీనిపై ఉత్తర్వులు జారీ చేయనున్నారు. దీంతో విజయవాడ, గుంటూరులోని పేదలకు భారీగా లబ్ది చేకూరబోతోంది.
గతంలో వైసీపీ హయాంలో అమరావతి రాజధాని స్ధానంలో మూడు రాజధానులు తెరపైకి తీసుకురావడంతో పాటు మరికొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంది. ఇందులో విజయవాడ, గుంటూరులోని పేదలకు అమరావతి రాజధానిలో ఆర్5 జోన్ పేరిట ఓ జోన్ ఏర్పాటు చేసి అందులో ఇళ్ల స్థలాలు కేటాయించింది. దీనిపై అప్పట్లో కొందరు హైకోర్టు, సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. దీంతో అమరావతి రాజధాని వ్యవహారం తేలే వరకూ ఈ స్థలాలపై ముందుకెళ్లొద్దని కోర్టులు ఆదేశాలు ఇచ్చాయి. దీంతో అమరావతి ఆర్ 5 జోన్ లో ఇళ్ల స్థలాలు కేటాయించిన పేదలకు ఇప్పటివరకూ అవి దక్కలేదు.

ఈ నేపథ్యంలో తాజాగా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధానిలోని ఆర్5 జోన్ ఏర్పాటు చేసి అందులో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల్ని రద్దు చేసి లబ్దిదారులకు విజయవాడ, గుంటూరులోనే స్థలాలు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. అవసరమైతే ఇందుకు భూసేకరణ చేపట్టాలని కూడా ఆదేశించారు. దీంతో ఇప్పుడు అధికారులు ఆర్ 5 స్థలాలు రద్దు చేసి విజయవాడ, గుంటూరులోనే వాళ్లకు ఇళ్ల స్థలాలు కేటాయించబోతున్నారు. ఇందులోనే వారికి ఇళ్ల నిర్మాణం కూడా జరగబోతోంది.












Click it and Unblock the Notifications