విశాఖ స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు ధోరణి మారిందా?: త్వరలో శ్వేతపత్రం

Visakhapatnam Steel Plant: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో తీరిక లేకుండా ఉంటోన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్రమంత్రులతో సమావేశం అయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, పోలవరం అంశాలపై మాట్లాడారు.

చంద్రబాబు కలిసిన వారిలో హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌, రోడ్లు- ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఉన్నారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్, పోలవరానికి 2,800 కోట్ల రూపాయల నిధులు, రాష్ట్రానికి కొత్తగా జాతీయ రహదారుల మంజూరు వంటి అంశాలపై వారితో చర్చించారు.

Chandrababu plans White Paper on Visakhapatnam steel plant privatization issue

అదే సమయంలో ఉక్కు శాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామితోనూ భేటీ అయ్యారు చంద్రబాబు. ఆ సమయంలో చంద్రబాబు వెంట కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, లోక్‌సభ సభ్యులు భరత్, లావు కృష్ణదేవరాయలు, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఉన్నారు.

విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కుమారస్వామితో చంద్రబాబు భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ స్టీల్ ఫ్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలంటూ చంద్రబాబు ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను అందజేశారు.

సెయిల్‌లో విలీనం కావడం వల్ల వైజాగ్ స్టీల్ ప్లాంట్.. నేరుగా కేంద్ర ప్రభుత్వపరమౌతుంది. భిలాయ్, బొకారొ, దుర్గాపూర్, రూర్కేలా, అసన్‌సోల్ వంటి స్టీల్ ప్లాంట్లు సెయిల్ ఆధీనంలో కార్యకలాపాలను కొనసాగిస్తోన్నాయి. అవన్నీ కూడా నేరుగా కేంద్రం ఆధ్వర్యంలోనే పని చేస్తాయి.

అదే తరహాలో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కూడా విలీనం చేయాలంటూ చంద్రబాబు ప్రతిపాదించారు. దీనికి గల సాధ్యసాధ్యాలను పరిశీలిస్తామని ఈ సందర్భంగా కుమారస్వామి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కుమారస్వామితో జరిగిన సమావేశం సారాంశాన్ని చంద్రబాబు తాజాగా వెల్లడించారు.

Chandrababu plans White Paper on Visakhapatnam steel plant privatization issue

స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు ఉన్న వివిధ ప్రత్యామ్నాయ మార్గాలపై నిర్మల సీతారామన్, కుమారస్వామితో చర్చించానని అన్నారు. 1,400 కోట్ల రూపాయల మేర నిధులను కేంద్రం ఇచ్చి ఊపిరి పోసిందని వ్యాఖ్యానించారు. ఈ సంస్థను పూర్తిగా పునరుద్ధరించడానికి కసరత్తు చేస్తోన్నామని తెలిపారు.

కొన్ని సంవత్సరాల పాటు స్టీల్ ప్లాంట్‌పై ఎలాంటి శ్రద్ధ పెట్టకుండా వదిలేశారని, ఇప్పుడు నిధులను ఇవ్వడం గొప్ప విషయమని అన్నారు. అన్ని ఇబ్బందులను అధిగమించి వైజాగ్ ఉక్కు కర్మాగారం ఎదుర్కొంటోన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనే అంశంపై చర్చిస్తున్నామని చెప్పారు.

ఈ ప్లాంట్ తెలుగుజాతి ఆత్మగౌరవానికి చిహ్నమని, వారి మనోభావాలకు సంబంధించిన విషయమని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగువారితో ముడిపడి ఉన్న ఈ ప్లాంట్‌ను ప్రైవేటీకరించకుండా ఎలా కాపాడు కోవాలనే దానిపై ప్రత్యామ్నాయ మార్గాల గురించి చర్చిస్తాన్నామని చెప్పారు.

సెయిల్‌కు ఇనుప ఖనిజం గనులను కేటాయించడం వల్ల ముడి సరకు ఖర్చు తగ్గుతుందని, అదే తరహాలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌కు కూడా సొంతంగా గనులను ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు చంద్రబాబు వివరించారు. ఆర్ఐఎన్ఎల్‌కు సొంతంగా ఇనుప ఖనిజ గనులను కేటాయిస్తే సెయిల్‌ తరహాలో పని చేయడానికి వీలుంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తరువాత సెయిల్‌లో విలీనం, ఇనుప ఖనిజ గనుల కేటాయింపు వంటి నిర్ణయాలపై శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని చంద్రబాబు అన్నారు. స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్ర సహకారం కావాల్సి ఉన్నందున పలు దఫాలుగా చర్చించాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+