ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మళ్లీ జిల్లాల విభజన- మహానాడులో చంద్రబాబు హామీ-ఇక క్విట్ జగన్-సేవ్ ఏపీ నినాదమే..

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న తప్పిదాలను తాను సరిచేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ తెలిపారు. ఒంగోలులో జరుగుతున్న టీడీపీ మహానాడు రెండోరోజు ముగింపు ప్రసంగం చేసిన బాబు.. ఇకపై క్విట్ జగన్-సేవ్ ఏపీ నినాదంతో ముందుకు వెళ్తామన్నారు. జగన్ సర్కార్ హయాంలో అన్యాయానికి గురైన ప్రతీ ఒక్కరికీ తాము అధికారంలోకి రాగానే అండగా నిలుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

 క్విట్ జగన్-సేవ్ ఏపీ

క్విట్ జగన్-సేవ్ ఏపీ

క్విట్ జగన్....సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో చంద్రబాబు మహానాడు రెండోరోజు ప్రసంగం ప్రారంభించారు. సభలో క్యాడర్ ఉత్సాహం చూస్తుంటే జగన్ ను ఎప్పుడు ఇంటికి పంపాలా అనే ఊపుతో ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టిడిపికి జనాలు ఉన్నారు....వైసిపికి బస్సులు ఉన్నాయన్నారు. సభలో బందోబస్తుకు పోలీసులు ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. పోలీసులు అదుపు తప్పితే టిడిపినే అందరినీ సరి చేస్తుందన్నారు.

ఈ భారీ సభతో జగన్ కు పిచ్చెక్కుతుందని, జగన్ కు మహానాడుతో నిద్రరాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
వైసిపి మీటింగ్ లు వెలవెలపోతుంటే మన మీటింగ్ లు కళకళలాడుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని, దీని కోసం ప్రతి జిల్లాలో మినీ మహానాడు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. కమిటీ వేసి ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. దేవుడు ఎలా ఉంటారు అంటే ఎన్టీఆర్ రూపంలో చూసుకుంటామన్నారు.

 అఖండకు ఇబ్బందులు పెట్టారుగా...

అఖండకు ఇబ్బందులు పెట్టారుగా...

అఖండ సినిమాకు జగన్ ఇబ్బందులు పెట్టాడా లేదా అని చంద్రబాబు కార్యకర్తల్ని ప్రశ్నించారు. ప్రభుత్వ అడ్డంకులు ఉన్నా సినిమా బాగా ఆడిందని, అదీ నందమూరి బాలకృష్ణని చంద్రబాబు తెలిపారు. సినిమాలకు జగన్ అనుమతి ఇవ్వాలా అని చంద్రబాబు ప్రశ్నించారు. గడప గడపకూ వైసిపి అన్నారు. తరువాత గడపగడపకూ ప్రభుత్వం అన్నాడని గుర్తుచేశారు. పోలీసుల రక్షణలో వెళ్లేందుకే కార్యక్రమం మార్చకున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు బస్సు యాత్ర పెట్టుకున్నారు, తరువాత గాలి యాత్ర పెట్టుకుంటారా అని అడిగారు. కరెంట్ చార్జీలు పెరిగాయా లేదా..నిత్యావసరాలు కొనే పరిస్థితి ఉందా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ పరిస్థితి చూస్తుంటే రేపో మాపో ఎపికూడా శ్రీలంక అవుతుందన్నారు. కుటుంబానికి లక్ష రూపాయల భారం పడుతుందన్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా....మీ కేసులకు భయపడమన్నారు. కేసులు పెడుతున్న వైసిపి నేతలు భవిష్యత్ లో ఇదే రోడ్ల మీద తిరగాలి అనేది గుర్తు పెట్టుకోవాలన్నారు. రౌడీల గుండెల్లో నిద్ర పోయిన పార్టీ టిడిపి అని, ఎవరినీ వదిలేది లేదని చంద్రబాబు హెచ్చరించారు.

 మా పథకాలన్నీ ఏవీ

మా పథకాలన్నీ ఏవీ

అన్న క్యాంటీన్ ఎవరు పెట్టారు, విదేశీ విద్య ఎవరు ఇచ్చారు, చంద్రన్న భీమా ఎవరు ఇచ్చారు, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు లేవని చంద్రబాబు ప్రశించారు. టిడిపి హయాంలో 50 శాతం సంక్షేమం కోసం ఖర్చు పెట్టామని, రాష్ట్రంలో అప్పులు 8 లక్షల కోట్లకు చేరుకున్నాయని, ఈ అప్పులు జగన్ కడతారా అని చంద్రబాబు అడిగారు. మద్యం బ్రాండ్లలో కూడా మాయ చేశారని, కొన్ని బ్రాండ్లు మాత్రమే ఎందుకు ఉంటున్నాయని ప్రశ్నించారు. ఎన్నికల ముందు చెప్పిన మద్యపాన నిషేధం ఏమయ్యిందని అడిగారు. మద్యం సీసాకు ప్రభుత్వం కంపెనీకి 9 రూపాయలు చెల్లించేదని, ఇప్పుడు 21 రూపాయాలు చెల్లిస్తున్నారని గుర్తుచేశారు.అదికూడా నాసిరకం మద్యం సరఫరా చేస్తున్నారన్నారు.ఏ షాప్ లోను బిల్లు ఇవ్వడం లేదని, ఆన్లైన్ పేమెంట్ ఎందుకుతీసుకోవడం లేదని ప్రశ్నించారు. మద్యం అమ్మకాల ద్వారా జగన్ ఏడాదికి 5 వేల కోట్లు సొంత ఖాతాలో వేసుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు.

 జగన్ సర్కార్ దోపిడీ ఇదీ..

జగన్ సర్కార్ దోపిడీ ఇదీ..

ట్రాక్టర్ ఇసుక 6 వేలు 7 వేలు ఎందుకు అయ్యిందని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో ఖనిజ సంపత అంతా వైసిపి పెద్దలు దోచేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రకాశం జిల్లాలో గ్రానైట్ పరిశ్రమల యజమానులకు బెదిరింపులు, సెటిల్మెంట్లు చేస్తున్నారన్నారు.జిల్లాలో గ్రానైట్ వ్యాపారులను వైసిపి నేతలు, ముఖ్యమంత్రి బెదిరించి దోచుకుంటున్నారని ఆరోపించారు. రికార్డులు మార్చి భూ కబ్జాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. మూడేళ్లలో సిఎం జగన్ అక్రమార్జన 1 లక్షా 75వేల కోట్ల రూపాయలని చంద్రబాబు తెలిపారు. జగన్ పాలనతో అన్ని శాఖలు నాశనం అయ్యాయన్నారు.. ధాన్యం డబ్బు ప్రజలకు ఎందుకు రాలేదు....రైతులు ఆత్మహత్యలు పెరిగాయని చంద్రబాబు ప్రశ్నించారు. ఆత్మహత్యలు పరిష్కారం కాదు, వైసిపిని బంగాళాఖాతంలో కలిపెయ్యాలని పిలుపునిచ్చారు. రైతు బరోసా పేరుతో ఇచ్చేది 7500, అది కూడా రెండు మూడు విడతల్లో ఇస్తారని గుర్తుచేశారు. జగన్ ఇచ్చేది గోరంత. పబ్లిసిటీ కొండంతని చంద్రబాబు విమర్శించారు.

 బ్లూ మీడియాకు పోటీగా సోషల్ మీడియా

బ్లూ మీడియాకు పోటీగా సోషల్ మీడియా

జగన్ అన్ని వ్యవస్థలను బ్లాక్ మెయిల్ చేశాడని, బ్లూ మీడియా ప్రభుత్వానికి తొత్తులుగా తయారు అవుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. • బ్లూమీడియాకు పోటీగా మాకు సోషల్ మీడియా ఉందన్నారు.కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదు...సోషల్ మీడియా ద్వారా మీ అభిప్రాయలు చెప్పండన్నారు. కార్యకర్తలకు కష్టం వస్తే నేను చూసుకుంటా....సోషల్ మీడియాను వాడుకోండన్నారు. జగన్ రెడ్డి వాలంటీర్ల ఉద్యోగం ఇచ్చాడు....టిడిపి ఇచ్చింది ఐటీ ఉద్యోగం, టీచర్, పోలీస్ ఉద్యోగమని చంద్రబాబు గుర్తుచేశారు. టిడిపి హయాంలో ఒప్పందం చేసుకున్న అదానీ, గ్రీన్ కో వాళ్లతో దావోస్ లో జగన్ కొత్తగా ఒప్పందం చేసుకున్నారని చంద్రబాబు విమర్శించారు. ఆ కంపెనీలతో అన్ని లావాదేవీలు చేసుకుని జగన్ కొత్తగా ఒప్పందాలు చేసుకున్నారని ఆక్షేపించారు. అదానీ, గ్రీన్ కో కోసం దావోస్ వరకు వెళ్లాలా అని నిలదీశారు. 300 యూనిట్ల కరెంట్ వాడితే అమ్మఒడి కట్, ఉద్యోగులకు జగన్ న్యాయం చేశాడా...సిపిఎస్ రద్దు చేశాడా....ఉద్యోగులకు నేను అండగా ఉంటా...వాళ్లు పోరాటం చెయ్యాలని పిలుపునిచ్చారు.

 జగన్ సామాజిక న్యాయం ఇదేనా

జగన్ సామాజిక న్యాయం ఇదేనా

జగన్ రాజ్యసభ సీట్లు ఎవరికి ఇచ్చాడని చంద్రబాబు ప్రశ్నించారు. తోటి నిందితులకు ముగ్గురికి ఇచ్చాడని, లాబీ చేసే వారికి..కేసులు వాదించేవారికి రాజ్యసభ ఇచ్చారని గుర్తుచేశారు. రాష్ట్రాన్ని పాలించేది సజ్జల, సాయిరెడ్డి, వేమిరెడ్డి, సుబ్బారెడ్డి. ఇదేనా సామాజిక న్యాయం అని చంద్రబాబు ప్రశ్నించారు. సామాజిక న్యాయానికి వైసిపి గొడ్డలి పెట్టని చంద్రబాబు విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి పాలన రాష్ట్రానికి అరిష్టం...జగన్ ఒక ఐరన్ లెగ్ అని చంద్రబాబు విమర్శించారు. నాకు హైకమాండ్ అంటే ప్రజలు, కార్యకర్తలే. నాకు మోహమాటాలు ఎక్కువ అంటారు.
నేను రాష్ట్రం కోసం, కార్యకర్తల కోసం మొహమాట పడతానని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

 జిల్లాల విభజన సమీక్షిస్తానన్న చంద్రబాబు

జిల్లాల విభజన సమీక్షిస్తానన్న చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వం పద్దతి ప్రకారం జిల్లాల ఏర్పాటు చెయ్యలేదని చంద్రబాబు ఆరోపించారు. ప్రకాశం జిల్లా కూడా జిల్లా విభజనతో ఇబ్బందులు ఉన్నాయన్నారు. జిల్లాల విభజనలో రాష్ట్రంలో ఉన్న అభ్యంతరాలు అన్నీ అధికారంలోకి వచ్చిన తరువాత సమీక్ష చేస్తామన్నారు. కార్యకర్తలు వీరోచితంగా పోరాడండి...జగన్ తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు భయపడవని చంద్రబాబు తెలిపారు. మీడియాను కూడా జగన్ బెదిరించాడు. కనీసం జర్నలిస్ట్ లకు అక్రిడేషన్లు కూడా ఇవ్వలేదు. విభజన కంటే జగన్ రెడ్డి పాలన వల్లనే ఎక్కువ నష్టం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. కరోనా వస్తే బయటకు రాని సిఎం ఈ జగన్ రెడ్డి అని చంద్రబాబు విమర్శించారు.

English summary
tdp cheif chandrababu on today made key comments in party's mahanadu in ongole.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X