వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్- సుప్రీంలో కేసు వేళ చంద్రబాబు కీలక నిర్ణయం..!
ఏపీలో ఆరేళ్లుగా సంచలనం రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు ముగిసినట్లు సీబీఐ ఏకంగా సుప్రీంకోర్టుకే నివేదించడం, ఈ కేసులో నిందితులకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీత కోరుతున్న నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో గతంలో జరిగిన ఓ ఘటనను తవ్వేందుకు ఇప్పుడు ప్రభుత్వం సిద్దమైంది.
వివేకా హత్య కేసులో తొలుత నిందితుడిగా ఉండి ఆ తర్వాత అప్రూవర్ గా మారిన దస్తగిరిని కడప సెంట్రల్ జైల్లో గతంలో ఇదే కేసులో మరో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి మెడికల్ క్యాంప్ పేరుతో వెళ్లి బెదిరించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో వెనక్కి తగ్గకపోతే చంపేస్తామని అప్పట్లో తనను బెదిరించారని దస్తగిరి సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై కోర్టుకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే అదంతా అబద్ధమని డాక్టర్ చైతన్య తెలిపారు.

దీంతో ఈ వ్యవహారం మరుగున పడిపోయింది. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఆ వ్యవహారాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. అప్పట్లో కడప జైల్లో ఉన్న దస్తగిరిని బెదిరించిన కేసులో విచారణ జరిపేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో పోలీసులు, మెడికల్, రెవెన్యూ అధికారుల్ని చేర్చింది. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ త్వరలో ఈ కేసును సమగ్రంగా విచారించబోతోంది.

కడప జైల్లో ఖైదీలను బెదిరించిన వ్యవహారంలో విక్రాంత్ పాటిల్ కమిటీ ఇచ్చే నివేదిక మేరకు చర్యలు తీసుకోవాలని హోంశాఖ నిర్ణయం తీసుకుంది. మెడికల్ క్యాంప్ పేరుతో ఖైదీలను బెదిరించారనే ఆరోపణలపై ప్రదానంగా ఈ కమిటీ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి దస్తగిరిని బెదిరించిన వ్యవహారంపై ప్రభుత్వం కమిటీ నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఓవైపు సుప్రీంకోర్టు వివేకా కేసుపై కీలక నిర్ణయానికి సిద్ధమవుతున్న వేళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చర్చ జరుగుతోంది.
-
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి!












Click it and Unblock the Notifications