ఆర్టీసీ సమ్మె, ప్రయాణీకుల ఇక్కట్లు: చంద్రబాబుకు కోపమొచ్చింది

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కేబినెట్‌ సబ్‌ కమిటీ వేస్తే వారితో చర్చించకుండా ఏకపక్షంగా సమ్మెకు వెళ్లారని విజయనగరం సభలో మండిపడ్డారు.

ఆర్టీసీ కార్మికులు వెంటనే సమ్మె విరమించాలని కోరారు. కేబినెట్‌ సబ్ కమిటీలో అన్ని విషయాలు ఆలోచించి, వాళ్లతో చర్చించిన తర్వాత పరిష్కారం చేద్దామంటే ఏకపక్షంగా సమ్మె చేసే పరిస్థితికి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజలకు చాలా అసౌకర్యం కలిగిస్తుందన ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు చంద్రబాబు సమ్మె విషయమై ఆరా తీశారు.

Chandrababu responds at RTC strike

కాగా, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మిక సంఘాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. బస్సులు బంద్ కావడంతో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయివేటు వాహనాల వల్ల అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు.

తమకు 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ఆర్టీసి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై యాజమాన్యం నుండి స్పష్టమైన హామీ రానందున సమ్మె బాట పట్టాయి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సమ్మె విరమింప చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, సఫలం కాలేదు. 27 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు అంగీకరించినా.. కార్మిక సంఘాలు 43 శాతం ఫిట్మెంట్ కోరుతున్నాయి. తమ డిమాండ్ నెరవేరే వరకు సమ్మె విరమించేది లేదని చెప్పాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+