తప్పుగా రాస్తే: జగన్‌కు బాబు, నేను చెప్పినా ఇంతేనా.. ఆగ్రహం

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సోమవారం నాడు కోపం వచ్చింది. తప్పుడు వార్తలు రాసే వారికి నోటీసులు ఇస్తామని ఆయన హెచ్చరించారు. పరోక్షంగా వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి పత్రికకు హెచ్చరికలు జారీ చేశారు.

సొంత ప్రయోజనాలా!: కేంద్రం-ఏపీ-తెలంగాణలకు సుప్రీం నోటీసులు

సదావర్తి భూముల వ్యవహారంలో బాధ్యతారహితంగా ప్రచారం చేశారని మండిపడ్డారు. ఆ భూముల పైన బహిరంగ విచారణకు రావాలని తాము సవాల్ చేస్తే ఎవరూ స్పందించలేదని విమర్శించారు. తప్పుడు రాతలు రాస్తే ఊరుకునేది లేదని చెప్పారు.

Chandrababu responds on Sadavarthi lands

కాంట్రాక్టర్లకు హెచ్చరిక

కృష్ణా పుష్కర పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామని చెప్పారు. ముఖ్యమంత్రి స్థాయిలో 7సార్లు రివ్యూ చేసినా ఫలితం లేకుండా ఎలా అని అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పుష్కర పనుల పైన అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు.

వెంకయ్యతో సై, వైసిపి ఐస్‌క్రీం పార్టీ, జగన్ సీఎం కావాలనుకున్నా: రఘువీరా

కాగా, ఈ నెల 23వ తేదీన చంద్రబాబు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. అచ్యుతాపురంలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించనున్నారు. పూడి గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అలాగే, బ్రాండిక్స్ ఉద్యోగులతో మాట్లాడుతారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP CM Chandrababu Naidu responds on Sadavarthi lands issue.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి