తుని హింసపై సిబిఐకి రెడీ: చంద్రబాబు వ్యూహం ఏమిటి?

హైదరాబాద్: తుని హింసపై విచారణను సిబిఐకి అప్పగించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంసిద్ధత వ్యక్తం చేయడం వెనక పెద్ద వ్యూహమే ఉందని అంటున్నారు. సిబిఐ దర్యాప్తునకు ఆదేశించడం ద్వారా ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఒకవైపు, కాపు నేత ముద్రగడ పద్మానాభాన్ని మరోవైపు దెబ్బ తీయవచ్చునని ఆయన భావించినట్లు ెబుతున్నారు.

తుని విధ్వంసకాండ దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని గన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.తన చేతిలో ఉంది కాబట్టి సీబీసీఐడీ ద్వారా విచారణ పేరుతో చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయిస్తున్నారని ఆయన విమర్శించారు. జగన్ డిమాండ్‌కు కాంగ్రెస్ నేతలు చిరంజీవి, సీ.రామచంద్రయ్య మద్దతు పలికారు,

ప్రభుత్వం ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించడానికి సిద్ధమేనని ప్రకటించింది. అయితే కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అంగీకరిస్తే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తామని హోంమంత్రి చిన్నరాజప్ప మెలికపెట్టారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ముద్రగడ అంగీకరించాలని షరతు విధించడం వెనుక ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించిందని అంటున్నారు.

Chandrababu's strategy in accepting for CBI probe on Tuni incidents

ఒకవేళ తుని విధ్వంసకాండపై ముద్రగడ సీబీఐ విచారణకు అంగీకరిస్తే, సీబీఐ విచారణ సమయంలో జగరబోయే అరెస్టులకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేకుండా పోతుందని, దాంతో కాపు నేతలకు టీడీపీ ప్రభుత్వాన్ని నిందించే అవకాశం ఉండదని చంద్రబాబు ప్రభుత్వ వ్యూహాంగా కనిపిస్తోందన్నారు. గతంలో రాజధాని భూకొనుగోలు వ్యవహారం, పట్టిసీమ అవినీతి వంటి అంశా లపై సీబీఐ విచారణను కోరితే నిరాకరించినట్లుగానే ఈసారి కూడా ప్రభుత్వం నిరాకరిస్తుందని ప్రతిపక్షాలు భావించి ఉంటాయని అంటున్నారు.

అందుకే జగన్ ఒకటి రెండుసార్లు సీబీఐ విచారణకు డిమాండ్ చేసినట్లు భావిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం ముందుకు రాకపోతే తుని విధ్వంసకాండ వెనుక అధికార పార్టీ నేతల ప్రమేయముందని ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందని ప్రతిపక్షాలు భావించినట్లు తెలుస్తోంది.

Chandrababu's strategy in accepting for CBI probe on Tuni incidents

తునిలో రైలు విధ్వంసానికి పాల్పడింది పోలీసులేనంటూ సి. రామచంద్రయ్య సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే విపక్షాలు ఎత్తుగడ ముందే గ్రహించిన చంద్రబాబు ప్రభుత్వం సీబీఐ విచారణకు అంగీకరిస్తూనే దానికి ముద్రగడ పద్మ నాభంను అంగీకరించాల్సిందేనని షరతు విధించింది.

సిబిఐ విచారణకు తాను అంగీకరిస్తే ముద్రగడ పద్మనాభం తనంత తానుగా దీక్ష విరమించాల్సి వస్తుంది. ఆందోళన చేయడానికి అవకాశం ఉండదు. కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయంపై ఆగస్టులో మంజునాథ కమిషన్ నివేదిక ఇచ్చేవరకు ఆందోళన చేపట్టడానికి వీలు కాదు. ఉద్యమం చల్లారినట్లు అవుతుందని ముద్రగడ భావించి సిబిఐ విచారణకు అంగీకరించలేదని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+