రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎక్కడిదాకైనా వెళ్తా .. కేంద్రం గెజిట్ పై అధ్యాయనం చేశాక స్పందిస్తా : చంద్రబాబు
తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులపై కేంద్రం ఇచ్చిన గెజిట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దుమారంగా మారింది. కేంద్రం ఇచ్చిన గెజిట్ వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు నీటి హక్కులను కోల్పోతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం ఇచ్చిన గెజిట్ పై చంద్రబాబునాయుడు స్పందించారు.
పూర్తిగా అధ్యయనం చేశాకనే తన అభిప్రాయం తెలియజేస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. విజయవాడలోని రమేష్ ఆస్పత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న టిడిపి ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిని పరామర్శించిన చంద్రబాబు అనంతరం మీడియాతో మాట్లాడుతూ బచావత్ ట్రిబ్యునల్ కు, గెజిట్ కు ఉన్న వ్యత్యాసాలను గుర్తించాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.దీన్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై వైసీపీ ప్రభుత్వం పారిపోయే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రం పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను ఎంతవరకైనా పోరాటం చేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఇటీవల కృష్ణా జిల్లా పర్యటన లో చంద్రబాబుతో పాటు, కార్యక్రమంలో పాల్గొన్న బచ్చుల అర్జునుడు కార్యక్రమం అనంతరం గుండెపోటుకు గురికావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు . ఈ క్రమంలో ఆయనను పరామర్శించిన చంద్రబాబు, ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన గెజిట్ పై లోతుగా అధ్యయనం చేశాక మాట్లాడతానన్నారు.
కృష్ణ జలాలలో ఏపీ వాటాను రక్షించడంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి విఫలమయ్యారు అని ఆయన విమర్శించారు. తాజాగా తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నేపథ్యంలో దృష్టిసారించిన కేంద్రం కృష్ణా , గోదావరి యాజమాన్య బోర్డుల పరిధి ఖరారు చేస్తూ గెజిట్ విడుదల చేసింది. రెండు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా గోదావరి బోర్డులకు అప్పగించింది. అక్టోబర్ 14 నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమలులోకి రానుంది.












Click it and Unblock the Notifications