హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు నిర్ణయం మంచికేనా?: సీఆర్‌డీఏ ఉద్యోగాల్లో ‘నో’ రిజర్వేషన్స్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరధిలోని కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అధారిటీ (సీఆర్‌డీఏ)లో ఉద్యోగాల విషయంలో రిజర్వేషన్లు అమలు చేయకూడదని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సీఆర్డీఏ పరిధిలో ప్రత్యేక మానవవనరుల విధానాన్ని రూపొందించింది.

దీంతో గతంలో మున్సిపల్ పరిపాలన శాఖ జారీ చేసిన 'సీఆర్‌డీఏ మానవ వనరుల విధానం' రద్దై పోతుంది. అంతేకాదు సీఆర్‌డీఏ నియామకాల విషయంలో ఏపీపీఎస్సీకి ఎలాంటి సంబంధమూ ఉండదు. కార్పొరేట్ తరహాలో రిక్రూట్‌మెంట్ ఉంటుంది.

సీఆర్‌డీఏలో శాశ్వత నియామకాల్లో గానీ, కాంట్రాక్టు నియామకాల్లో గానీ ఇకపై ఎలాంటి రిజర్వేషన్లను పాటించరు. కేవలం వారి విద్యార్హతలు, నైపుణ్యం ప్రాతిపదికనే నియమాకాలను చేయనున్నట్లు నూతనంగా రూపొందించిన మానవ వనరుల పాలసీలో పేర్కొన్నారు.

Chandrababu says bring corporate policy in crda recruitment

కార్పొరేట్ సంస్థల తరహాలోనే రిక్రూట్‌మెంట్ విధానం ఉంటుందని పాలసీలో పేర్కొన్నారు. ఖాళీలను భర్తీ చేయాలంటే ప్రతికల్లో నోటిఫికేషన్ జారీ చేస్తారు. కాంట్రాక్టు విధానంలో గానీ, రెగ్యులర్ విధానంలో గానీ ఉద్యోగులను తీసుకునే అధికారం సీఆర్‌డీఏ కమిషనర్‌కు ఉంటుంది.

నూతన రిక్రూట్‌మెంట్‌కు ప్రకటన ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తారు. ఆ దరఖాస్తులను మానవ వనరుల గ్రూప్ పరిశీలిస్తుంది. రాత పరీక్షతో పాటు అవసరమైన పక్షంలో ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను సెలక్ట్ చేస్తారు. రిక్రూట్‌మెంట్‌లో అభ్యర్థి చదివిన విద్యతో పాటు ఆ చదివిన సంస్థకున్న పేరు ప్రతిష్టలు, అనుభవం, రాత పరీక్ష, మానసిక పరిస్థితి, ఇంటర్వ్యూకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఈ పాలసీలో పేర్కొన్నారు.

అనంతరం ఇంటర్యూలో ఎంపికైన అభ్యర్ధులకు ఆఫర్ లెటర్ జారీ చేస్తారు. తర్వాత ఎంపికైన ఉద్యోగులు వైద్య పరీక్షల సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఉద్యోగిగా పనిచేయడానికి సరిపోతారని వైద్య పరీక్షల్లో తేలితేనే ఉద్యోగంలో చే ర్చుకుంటారు. లేకపోతే ఆఫర్ లెటర్‌ను రద్దు చేస్తారు.

ఇదిలా ఉంటే సీఆర్‌డీఏ ఉద్యోగాలకు కనీస వయోపరిమితి 18 సంవత్సరాలుగా విధానంలో పేర్కొన్నారు. పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలుగా నిర్ధారించారు. సీఆర్డీఏలో 60 ఏళ్ల పైబడిన వారి సేవలను వినియోగించుకునే నిమిత్తం కాంట్రాక్టు విధానంలో వారిని కూడా తీసుకోవచ్చని అందులో పేర్కొన్నారు.

Chandrababu says bring corporate policy in crda recruitment

అయితే అథారిటీ ఎవరినైనా 60 ఏళ్ల పైబడిన వారిని కూడా కాంట్రాక్టు విధానంలో తీసుకోవచ్చునన్నారు. ఉద్యోగుల ప్రొబేషన్ పిరియడ్‌ సమయాన్ని ఏడాదిగా నిర్ధారించారు. అంతేకాదు సీఆర్డీఏ ఉద్యోగులు డ్రెస్ కోడ్ పాటించాలని కొత్త విధానంలో పేర్కొన్నారు.

'సీఆర్‌డీఏ మానవ వనరుల విధానం' ఇలా ఉండాలంటూ గత ఏడాది ఏప్రిల్ 16వ తేదీన మున్సిపల్ పరిపాలన శాఖ జారీ చేసిన 81, 82, 83 జీవోల స్థానంలో నూతనంగా రూపొందించిన మానవ వనరుల పాలసీని ఆమోదించాలంటూ సీఆర్‌డీఏ అధారిటీ ఆమోదానికి కమిషనర్ సమర్పించారు.

గతంలో మున్సిపల్ పరిపాలన శాఖ జారీ చేసిన జీవోల్లో సీఆర్‌డీఏ రిక్రూట్‌మెంట్ విధానంలో 1996 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అండ్ సబ్-ఆర్డినేట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్లను అమలు చేయాలని స్పష్టం చేశారు. తాజా నిర్ణయంతో ఇకపై సీఆర్‌డీఏలో ఉద్యోగాల భర్తీ ప్రభుత్వ పెద్దల ఇష్టారాజ్యంగా మారిపోనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు కాంట్రాక్టు పద్ధతిన నియామకాలు కూడా ప్రభుత్వ పెద్దలు తమకు నచ్చినవారికి నియమించుకునేలా ఈ కొత్త పాలసీని తీసుకొచ్చారని మండిపడుతున్నారు.

English summary
Chandrababu says bring corporate policy in crda recruitment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X