వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను నిప్పు: చంద్రబాబు కౌంటర్, అదే పాయింట్ లాగుతున్న జగన్

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఓటుకు నోటు కేసుపై ఏపీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు స్పందించారు. ఈ కేసు పునర్విచారణ పైన హైకోర్టు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

దీనిపై వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు ఏ తప్పు చేయకుంటే హైకోర్టుకు వెళ్లి ఎందుకు స్టే తెచ్చుకున్నారని ప్రశ్నించారు. దీనిపై చంద్రబాబు కర్నూలు జిల్లాలో స్పందించారు.

తాను నిప్పులా బతుకుతున్నానని చెప్పారు. అవినీతికి తావు లేకుండా నీతి నిజాయతీతో పాలన సాగిస్తున్నానని వ్యాఖ్యానించారు.

'ప్రత్యేక' అడుగు: రంగంలోకి పవన్ కళ్యాణ్, పిలిచి చిక్కుల్లో పడ్డ జగన్!'ప్రత్యేక' అడుగు: రంగంలోకి పవన్ కళ్యాణ్, పిలిచి చిక్కుల్లో పడ్డ జగన్!

కాగా, చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ప్రమేయంపై దర్యాప్తు జరపాలన్న తెలంగాణ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. పూర్తి విచారణ కోసం కౌంటర్‌ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశించించింది. అనంతరం విచారణను 8 వారాలపాటు వాయిదా వేసింది.

 Chandrababu says he is fire

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ప్రమేయంపై విచారణ చేపట్టాలని మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు చంద్రబాబు ప్రమేయంపై దర్యాప్తు జరపాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఏసీబీ కోర్టు ఆదేశాలపై ఏపీ సీఎం చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల ఏసీబీ కోర్టులో పిటిషన్‌ వేశారని చంద్రబాబు తరఫు లాయర్ వాదించారు.

ఓటుకు నోటు కేసులో దర్యాప్తు కొనసాగుతుందని, ఇదే విషయాన్ని ఏసీబీ కోర్టుకు తెలియజేశామని ఏసీబీ తరఫు లాయర్ తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న జడ్జి జస్టిస్‌ ఇలంగో.. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశిస్తూ విచారణను ఎనిమిది వారాలపాటు వాయిదా వేశారు.

ఆ పాయింట్ లాగుతున్న జగన్

ఓటుకు నోటు కేసులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబును కార్నర్ చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా ప్రధానంగా ఆ పార్టీ నేతలు ఓ ప్రశ్నను సంధిస్తున్నారు. ఓటుకు నోటులో ఫోన్లో 'బ్రీఫ్డ్ మి' అని తాను చెప్పలేదని వైసిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆ ఫోన్లో గొంతు తనది కాదని చంద్రబాబు ఎప్పుడు చెప్పడం లేదని గుర్తు చేస్తున్నారు.

English summary
AP CM Chandrababu Naidu on Friday said that he is fire. Chandrababu said he is done nothing wrong in his political career.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X