వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'సాక్షి' ప్రభుత్వ పత్రిక: జగన్‌కి బాబు షాక్, నా జేబులో డబ్బులుండవ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాక్షి పత్రికకు చెందిన ఆస్తులు ప్రభుత్వ అటాచ్‌మెంటులో ఉందని, అంటే అది ప్రజల ఆస్తి అని, అలా అది ప్రభుత్వ పత్రిక అవుతుందని, అలాంటి పత్రిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తోందని వ్యాఖ్యానించారు.

సత్యం, గ్లోబల్‌ ట్రస్ట్ ఆస్తులను అటాచ్‌ చేస్తే అవి ప్రభుత్వానికే చెందాయని, ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నట్లే అవినీతి ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని, దీనికి సంబంధించి ప్రత్యేక కోర్టుల ఏర్పాటు బిల్లు ప్రస్తుతం ఢిల్లీలో ఉందని, లేపాక్షి భూములను కూడా విడిచిపెట్టమన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు పైన విచారణ సాగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు పై వ్యాఖ్యలు చేశారు. సాక్షి పత్రిక ప్రజల, ప్రభుత్వ ఆస్తి అని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు శనివారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు.

Chandrababu says we are earning Rs.100 crore from Heritage, Lashes out at Sakshi daily

తనకు సింగపూర్లో ఆస్తులు ఉన్నాయన్న విపక్షాల ఆరోపణలను చంద్రబాబు తిప్పికొట్టారు. సింగపూర్‌‌కు వెళ్తే అక్కడ ఆస్తులున్నాయంటారని, అక్కడకు అవినీతి పరులు వెళితే బయటకు రాలేరని చంద్రబాబు అన్నారు.

ఓసారి తాను సింగపూర్‌లో ప్రయాణం చేసినప్పుడు ఓ డ్రైవర్‌కు రూ.50 టిప్‌గా ఇచ్చానని, తనకు ఆదాయం బాగానే వస్తుందని చెబుతూ ఆయన దానిని తీసుకోలేదన్నారు. ఇక్కడ అవినీతి ఉందా? అంటే లేదని చెప్పాడని, అలాంటి దేశంతో అవినీతి చేస్తున్నానంటూ దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

ప్రాజెక్టులు, పలు విషయాల్లో ఏదో అవినీతి జరిగిందని ఓ అవినీతి పత్రిక రాస్తోందని సాక్షి పైన ధ్వజమెత్తారు. నా పేరును, మా అబ్బాయి లోకేష్ పేరును ప్రస్తావిస్తోందని, అంత కక్కుర్తి పడాల్సిన అవసరం టిడిపికి, తమకు లేదన్నారు.

ప్రాజెక్టులను గాడిలో పెట్టాలని ప్రయత్నిస్తుంటే, బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, అనవసరంగా తమ కుటుంబ సభ్యుల్ని ఈ వ్యవహారంలోకి తీసుకురావడం చూస్తుంటే చాలా బాధేస్తోందని, నా భార్య భువనేశ్వరి హెరిటేజ్‌ వ్యాపారం చూసుకుంటుందన్నారు. ఏటా రూ.100 కోట్ల ఆదాయం వస్తోందని చెప్పారు.

ఏటా కుటుంబ ఆస్తులను, వ్యక్తిగత ఆస్తులను ప్రకటిస్తున్నానని, అవి కాకుండా ఎక్కడైనా ఆస్తులున్నాయి నిరూపిస్తే వాటిని కూడా మీకే రాసిస్తానని చెబుతున్నానని, అయినా నిరూపించలేకపోయారని, తనకు కనీసం ఉంగరం, గడియారం కూడా లేదన్నారు. జేబులోనూ డబ్బులుండవని చెప్పారు.

English summary
Chandrababu says we are earning Rs.100 crore from Heritage, Lashes out at Sakshi daily.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X