పెద్దిరెడ్డికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్..! అంగళ్ళు కి వస్తూనేఉంటా అంటూ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క పథకమూ ఆగదని తెలుగుదేశం అధినేత నారా చద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి, అనంతపురం అర్బన్‌, చిత్తూరు జిల్లా అంగళ్లుులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగసభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపై చంద్రబాబు నిప్పులు చెరిగారు.

ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ప్రజల మెడకు ఉరితాడులా మారిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ నేతల భూములను కూడా జగన్‌ వదలరని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మంచినీళ్లు రాలేదని అడిగినందుకు గర్భిణి అని చూడకుండా, తంబళ్లపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారకానాథ్‌రెడ్డి సతీమణి సాక్షిగా వైసీపీ నాయకులు దాడి చేశారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chandrababu slams minister peddireddy ramachandra reddy

ఇక పాపాల పెద్దిరెడ్డికి టైమ్‌ దగ్గరపడిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. పెద్దిరెడ్డిది ఎర్రచందనం, మైనింగ్‌, ఇసుక మాఫియా అని ఆరోపించారు. కొమ్ములు విరగ్గొడతాం జాగ్రత్త అంటూ మంత్రి పెద్దిరెడ్డికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పెద్దిరెడ్డి అరాచకాలన్నీ లెక్కపెడుతున్నామని, ప్రతిదాన్నీ సెటిల్ చేస్తామని హెచ్చరించారు. పెద్దిరెడ్డి, ఆయన కుటుంబసభ్యులు భూ దోపిడీకి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.

మే 13న ఫ్యానుకు, జగన్ పార్టీకి ఉరివేయాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కల్తీ మద్యంతో ఆడవాళ్ల మంగళసూత్రాలు తెంచిన వ్యక్తి జగన్ అని ధ్వజమెత్తారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్‌ ఏం చేశాడో, రాబోయే రోజుల్లో ఏం చేస్తాడో చెప్పే దమ్ముందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. గడిచిన ఐదు సంవత్సరాల్లో ఒక్క చిన్న పరిశ్రమను కూడా తేలెకపోయారని మండిపడ్డారు.

గతంలో సైతం ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నా, ఒక్క ముస్లింకైన అన్యాయం జరిగిందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ముస్లింల కోసం అనేక పథకాలు తీసుకువచ్చామని గుర్తు చేశారు. మక్కాకు పోవాలంటే లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేస్తామి హామీ ఇచ్చారు. మసీదుల నిర్వాహణకు రూ.5 వేల ఆర్థిక సహాయం చేస్తామన్నారు. ముస్లిం రిజర్వేషన్లు కాపాడుతామని హామీ ఇచ్చారు. మరోవైపు, రాజంపేట కూటమి ఎంపీ అభ్యర్థి, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఐదేళ్ల వైసీపీ పాలనలో దోపిడీతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఇలాంటి నేతలు మనకు అవసరమా? అని ప్రశ్నించారు. చంద్రబాబు, తాను కలిసి చిత్తూరు జిల్లాకు ఎంతో మేలు చేశామని గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+