నారా లోకేష్ ఎర్ర డైరీ స్కెచ్, చంద్రబాబు దెబ్బకు ఫస్ట్ వికెట్, పెద్దిరెడ్డి ఇలాకాలో ఆరోజు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్ కన్నెర్ర చేశారని వెలుగు చూసింది. చంద్రబాబు సొంత జిల్లాలో ఎస్పీగా పని చేసిన వై. రిశాంత్ రెడ్డికి ఎన్డీఏ ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. కొన్ని నెలల క్రితం వరకు చిత్తూరు జిల్లా ఎస్పీగా పని చేసిన రిశాంత్ రెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి ప్రియ శిష్యుడిగా పేరు తెచ్చుకుని నేడు చంద్రబాబు, నారా లోకేష్ ఆగ్రహానికి గురైనారు.
ఐపీఎస్ అధికారి రిశాంత్ రెడ్డికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చెయ్యాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ కావడంతో ఆయన ఇప్పుడు అయోమయంలో పడిపోయారని తెలిసింది. ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ రెడ్ బుక్ లోని ముగ్గురు ముఖ్యమైన పోలీసు అధికారుల పేర్లలో చిత్తూరులో గతంలో ఎస్పీగా పని చేసిన రిశాంత్ రెడ్డి పేరు కూడా ఉందని వెలుగు చూసింది.

వైసీపీ ప్రభుత్వంలో నెంబర్ టూగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అండదండలతో రిశాంత్ రెడ్డి చిత్తూరు ఎస్పీగా పని చేశారు. గత ఏడాది ఆగస్టు 4వ తేదీన చంద్రబాబు నాయుడు పుంగనూరు పర్యటన సందర్బంగా జరిగిన గొడవల కారణంగా రిశాంత్ రెడ్డి వందల మంది టీడీపీ కార్యకర్తల మీద హత్యాయత్నం కేసులు నమోదు చేసి జైలుకు పంపించారని ఆరోపణలు ఉన్నాయి అదే సమయంలో 300 మంది టీడీపీ కార్యకర్తలు సైతం జైలుకు వెళ్లారు.
చంద్రబాబుకు స్వాగతం పలకడానికి ప్రయత్నించిన 70 మంది టీడీపీ కార్యకర్తల మీద రౌడీషీటు కూడా అదే సమయంలో తెరిచారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గతంలో ఆయన సొంత నియోజక వర్గంలో పర్యటిస్తున్న సమయంలో జీవో నెంబర్ 1 ని అడ్డుపెట్టుకుని ఆయన వాహనాల్లో సంచరించకుండా పోలీసులు అడ్డుకున్నారు. అప్పుడు కూడా రిశాంత్ రెడ్డి చిత్తూరు జిల్లా ఎస్పీగా ఉన్నారు.

ఆ సందర్బంలో చంద్రబాబు నాయుడు అప్పటి ఎస్పీ రిశాంత్ రెడ్డి మీద బహిరంగంగానే విమర్శలు చేశారు. మీరు ప్రజలు, ప్రభుత్వం కోసం పని చేస్తున్నారా, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కోసం పని చేస్తున్నారా ? అంటూ చంద్రబాబు నాయకుడు ఆరోపణలు చేశారు. తరువాత వాహనాలు దిగి కాలినడకన చంద్రబాబు నాయుడు కుప్పం నియోజక వర్గంలోని అనేక గ్రామాల్లో పర్యటించి టీడీపీ కార్యకర్తలను కలుసుకున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుప్పం నుంచి యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్రను అప్పటి చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ప్రతిచోట అడ్డుకున్నారని స్వయంగా నారా లోకేష్ అప్పట్లో ఆరోపించారు. యువగళం ప్రచార రథంతో పాటు ఆయన కాన్వాయ్ ని అడ్డుకున్న అప్పటి ఎస్పీ రిశాంత్ రెడ్డి టీడీపీ కార్యకర్తలను నానా ఇబ్బందులకు గురి చేశారని ఆరోపణలు ఉన్నాయి.

అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా రిశాంత్ రెడ్డి మీద టీడీపీ నాయకులు ఫిర్యాదులు చెయ్యడంతో ఎన్నికల కమీషన్ ఆయన్న చిత్తూరు జిల్లా ఎస్పీ పదవి నుంచి బదిలి చేసింది. అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వం రిశాంత్ రెడ్డి విషయంలో పావులు కదిపిందని ఆరోపణలు ఉన్నాయిన్నాయి. తరువాత రిశాంత్ రెడ్డిని వేరే జిల్లాకు బదిలి చెయ్యకుండా తిరుపతి ఎర్రచందనం టాక్స్ ఫోర్స్ ఎస్పీగా నియమించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఆయన ఉండేలా ప్లాన్ చేసిందని ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లోనే రిశాంత్ రెడ్డి పేరు తన ఎర్ర డైరీలో రాసుకుంటానని నారా లోకేష్ చెప్పారు.
నారా లోకేష్ ఎర్ర డైరీలోని ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లలో రిశాంత్ రెడ్డి పేరు కూడా ఉందని తెలిసింది. ఇప్పుడు రిశాంత్ రెడ్డికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం ఆయన్ను ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ముఖ్య అనుచరుడిగా పేరు తెచ్చుకున్న ఎస్పీ రిశాంత్ రెడ్డి, అప్పటి పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డిలకు ఇప్పుడు సినిమా చూపించాలని టీడీపీ నాయకులు డిసైడ్ అయ్యారని తెలిసింది.
-
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications