చంద్రబాబు ఒకటి చెబితే, ఈయన మరొకటి: శ్రీకాంత్ రెడ్డి

రైతులు రుణాలుమాఫీ చేయకుంటే చంద్రబాబు వారిని మోసం చేసినట్లే అన్నారు. చంద్రబాబు తాను ఇచ్చిన వాగ్దానాలను అన్నింటిని అమలు చేయడం లేదని విమర్శించారు.
శ్వేతపత్రాల్లో వాస్తవం లేదు: ఏపీ కాంగ్రెస్
చంద్రబాబు విడుదల చేసే శ్వేతపత్రాలలో ఎలాంటి వాస్తవం లేదని ఏపీ కాంగ్రెసు పార్టీ ఆరోపిస్తోంది. చంద్రబాబు శ్వేతపత్రాలకు కౌంటర్‌గా వారు వాస్తవ పత్రాలు తీసుకు రానున్న విషయం తెలిసిందే. దీనిపై ఇందిరా భావన్లో కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో నేతలు భేటీ అయ్యారు. చంద్రబాబు హయాంలో ఏం చేశారు, తమ హయాంలో ఏం చేశామనే విషయాన్ని తాము వెల్లడిస్తామని చెబుతున్నారు. టీడీపీ ప్రభుత్వం రుణాలను మాఫీ చేయాలని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి వేరుగా అన్నారు.
వంతెన పూర్తి చేస్తాం: శిద్ధా
రాజమండ్రి - కొవ్వూరు వంతెనను వచ్చే ఏడాది మార్చికల్లా పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి శిద్ధా రాఘవరావు చెప్పారు. గోదావరి పుష్కరాల సమయానికి వంతెనను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన అన్నారు. రాజమండ్రి రోడ్ కమ్ రైలు వంతెన మరమ్మతుల కోసం రూ.2.50 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications