పులిచింతల గేట్ అందుకే కొట్టుకుపోయింది: చంద్రబాబు, ‘పాదం’పడితే మటాషేనంటూ మంత్రి అనిల్

అమరావతి: పులిచింతల గేటు విరిగి వరదనీటిలో కొట్టుకుపోయిన విషయంపై ఇప్పుడు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. మీ వైఫ్యలమే అంటే మీ వైఫల్యమే అంటూ విమర్శించుకుంటున్నారు. తాజాగా, తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కూడా రంగంలోకి దిగారు.

అందుకే పులిచింతల గేటు కొట్టుకుపోయిందంటున్న చంద్రబాబు

అందుకే పులిచింతల గేటు కొట్టుకుపోయిందంటున్న చంద్రబాబు

వైస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన నాసిరకం పనుల వల్లే పులిచింతల గేటు కొట్టుకుపోయిందని చంద్రబాబు ఆరోపించారు. శుక్రవారం టీడీఎల్పీ, పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు వర్చువల్ సమావేశం నిర్వహించిన సందర్భంగా మాట్లాడారు. స్కాంలు చేసే స్కీములకు చేసిన అప్పులు మళ్లించి వైఎస్ జగన్ ప్రభుత్వం హోల్‌సేల్ అవినీతి చేస్తోందని మండిపడ్డారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేదని, పెన్షనర్లు కూడా రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు ఆరోపించారు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు కూడా చెల్లించకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి దేవినేని ఉమ బెయిల్‌పై బయటకు వస్తే చట్ట విరుద్ధంగా జాతీయ రహదారిని బ్లాక్ చేశారని ధ్వజమెత్తారు.

ఏపీ నుంచి పరిశ్రమలు పారిపోతున్నాయన్న చంద్రబాబు

ఏపీ నుంచి పరిశ్రమలు పారిపోతున్నాయన్న చంద్రబాబు


పోలవరాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారని చంద్రబాబు విమర్శించారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. విశాఖపట్నంలో బాక్సైట్ మైనింగ్‌తో వేలాది కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. జగన్ అరాచక పాలనకు భయపడి పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయని అన్నారు. అమరరాజా కంపెనీ ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోతున్న క్రమంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసినట్లుంది.

ఏపీ నుంచి కంపెనీలు పారిపోతున్నాయన్న చంద్రబాబు

ఏపీ నుంచి కంపెనీలు పారిపోతున్నాయన్న చంద్రబాబు

పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పేరుతో.. ప్రభుత్వానికి వేల కోట్ల ఆదయం వచ్చే పెద్ద కంపెనీలను తామే పొమ్మంటున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల మాట్లాడే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేశారన్నారు చంద్రబాబు. రెండు లక్షల కోట్ల సంపదను నిరుపయోగ ఆస్తిగా మార్చారని ధ్వజమెత్తారు. అమరావతి రాజధాని రైతుల పోరాటానికి 600 రోజులు పూర్తవుతోందని, వీరి పోరాటానికి తమ మద్దతు ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. పులిచింతల గేటు కొట్టుకుపోయిన ఘటనపై ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పూర్తిగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు.

చంద్రబాబు పాదం పడితే మటాష్.. మంత్రి అనిల్

చంద్రబాబు పాదం పడితే మటాష్.. మంత్రి అనిల్

మరోవైపు అధికార వైసీపీ నేతలు చంద్రబాబు సహా టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. టీడీపీ హయాంలో అన్నమయ్య రిజర్వాయర్‌ గేట్లు కొట్టుకుపోయాయి.. గోదావరిలో చంద్రబాబు పాదం పెడితే 30 మంది చనిపోయారని మంత్రి అనిల్‌ కుమార్‌ తీవ్ర విమర్శలు చేశారు. నారా లోకేష్‌ చేస్తోన్న ట్వీట్లపై అనిల్‌ కుమార్ యాదవ్ మండిప్డడారు. లోకేష్‌ వాడుతున్న పదాలు ఎలాంటివో ఆయనే చెప్పాలని కోరారు. గతంలో పులిచింతలపై వచ్చిన రిపోర్ట్‌ను చంద్రబాబు ప్రభుత్వం పక్కన పెట్టిందని మంత్రి అనిల్‌ గుర్తు చేశారు. పులిచింతల కాంట్రాక్టర్‌ టీడీపీ నేత కాదా.. ఆయన దగ్గర చంద్రబాబు లాలూచీ పడి 700 రోజులు కోర్టులో కౌంటర్‌ కూడా వెయ్యలేదని మంత్రి అనిల్‌ కుమార్‌ ఆరోపించారు. ఈ విషయం లోకేష్‌కి తెలుసా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్షాలు పడలేదు.. సీఎం జగన్‌ పాదం పెట్టాకే వానలు పుష్కలంగా పడుతున్నాయని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+