వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ అలా ప్రమాణం చేశారు కానీ.: అక్రమ కేసులు, జైలుకు పంపడాలు అందుకే..

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతల వరుస అరెస్టుల నేపథ్యంలో అధికారంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

అలా ప్రమాణం చేశారు కానీ..

అలా ప్రమాణం చేశారు కానీ..

టీడీపీ నాయకులతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు చంద్రబాబు నాయుడు. రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని ప్రమాణం చేసిన సీఎం జగన్.. ఇప్పుడు స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారం చేపట్టిన ఆయన.. ఆ రాజ్యాంగ వ్యవస్థలనే నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

వైసీపీ దుర్మార్గాలకు అంతం లేదు..

వైసీపీ దుర్మార్గాలకు అంతం లేదు..


నేరగాళ్లకు టీడీపీ భయపడే ప్రసక్తే లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. వైసీపీ కండువా వేసుకుంటే వందల కోట్లు రద్దు చేస్తున్నారని, లొంగకపోతే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని అధికార పార్టీపై ధ్వజమెత్తారు. ఇటీవల టీడీపీ నేతలు వైసీపీలో చేరుతున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.
వైసీపీ దుర్మార్గాలకు అంతం లేకుండా పోతోందని, ప్రజాదరణ ఉన్న రాజకీయ కుటుంబాలపై సీఎం జగన్ కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు.

జగన్ అసహనంతోనే ఇలా..

జగన్ అసహనంతోనే ఇలా..

ప్రలోభాలకు లొంగలేదనే పగ సాధిస్తూ అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ దుశ్చర్య వల్లే అచ్చెన్నాయుడికి మళ్లీ శస్త్ర చికిత్స చేసే పరిస్థితి వచ్చిందన్నారు. అచ్చెన్నాయుడి అరెస్టుపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు చంద్రబాబు నాయుడు. కోర్టు తీర్పులతో జగన్ అసహనం రెట్టింపు అవుతోందని.. తాను జైలుకు వెళ్లారు కాబట్టే అందరూ వెళ్లాలనేదే జగన్ అక్కసు అని దుయ్యబట్టారు.

Recommended Video

Chandrababu Naidu's Conistable Tested Positive For Corona Virus
అధికార దుర్వినియోగం అంతా ఇంతా కాదు..

అధికార దుర్వినియోగం అంతా ఇంతా కాదు..


తప్పుడు ఫిర్యాదులు చేసి, నకిలీ పత్రాలు పెట్టి అరెస్టులు చేయిస్తారా? అని చంద్రబాబు నిలదీశారు. ప్రభుత్వ పనులకు జగన్ కంపెనీ సిమెంట్ కొనాలా? సొంత మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు, సిబ్బందికి ప్రభుత్వ జీతాలా? అని ప్రశ్నించారు. అధికారాన్ని దుర్వినియోగం చేయడంలో జగన్మోహన్ రెడ్డిని మించినవారు లేరంటూ చంద్రబాబు దుయ్యబట్టారు. కాగా, టీడీపీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడిని ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పలువురు టీడీపీ నేతలు కూడా వరుసగా అధికార పార్టీలో చేరుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ మేరకు తీవ్రంగా స్పందించారు.

English summary
TDP president chandrababu slams YSRCP ys jagan for tdp leaders arrested issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X