పాకిస్థాన్ ప్రధాని సంచలన ట్వీట్.. మరో 24 గంటల్లో..

దాదాపు 100 రోజులకు పైగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్- అమెరికా మధ్య యుద్ధం కారణంగా ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించింది. దాంతో ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. అయితే ఇరాన్- అమెరికా మధ్య శాంతిని నెలకొల్పేందుకు పాకిస్థాన్ యత్నిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన తొలి దశ శాంతి చర్చలు విఫలమయ్యాయి. అయితే తాజాగా అమెరికా- ఇరాన్ చర్చల్లో కీలక పురోగతి సాధించినట్లు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

" మేము శాంతి ఒప్పందానికి అతి చేరువలో ఉన్నాం.. మరో 24 గంటల్లో డీల్ ఫైనల్ అవుతుంది. వచ్చేవారం ఇదే విషయాలపై సాంకేతికంగా చర్చలు జరిపిన తర్వాత ఈ ఒప్పందాలపై పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ సంతకం చేస్తుంది. ఈ మేరకు మేము యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.. అలాగే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే తమకు మద్దతుగా నిలిచిన ఈ ప్రాంతాలోని నా సోదరులకు నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. ఈ చారిత్రాత్మక ఒప్పందం ద్వారా ఈ ప్రాంతంలో శాంతి కచ్చితంగా ఏర్పడుతుందని మేము బలంగా నమ్ముతున్నాం" అని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పష్టం చేశారు.

మరోవైపు అమెరికా- ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చల్లో కీలక పురోగతి సాధించినట్లు ట్రంప్ సర్కార్ లోని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ ఒప్పందం ప్రకారం.. ఇరాన్.. ఇకపై ఎప్పటికీ అణ్వాయుధాలను అభివృద్ధి చేయలేదని.. అలాగే కొనుగోలు చేయకూడదని అంగీకరించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ హామీ కేవలం మాటలకే పరిమితం కాకుండా నిరంతర పర్యవేక్షణ, కఠినమైన తనిఖీలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ భవిష్యత్తులో అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా అడ్డుకట్ట వేసే దిశగా ఇది కీలకమైన తొలి అడుగుగా అభివర్ణించారు.

ShehbazSharif Predicts Major Breakthrough US and Iran to Reach Final Agreement in Next 24 Hours

ఇక ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా 60 రోజుల ప్రత్యేక సాంకేతిక చర్చల కాలాన్ని కూడా ప్రతిపాదించినట్లు అధికారి స్పష్టం చేశారు. ఈ ఒప్పందానికి అమెరికా మిత్ర దేశాలైన ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు కూడా మద్దతు ఇస్తాయని అమెరికా అభిప్రాయపడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+