జగన్ తెచ్చిన చట్టంతో జాగ్రత్త: చంద్రబాబు తీవ్ర విమర్శలు

కడప: ప్రజల భూముల పాసుపుస్తకాలపై సీఎం జగన్‌రెడ్డి బొమ్మను ముద్రిస్తున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.జగన్ రెడ్డి చేసిన దౌర్జన్యాలను ప్రశ్నించాలని ఏపీ మాజీ సీఎం ప్రజలను కోరారు. అన్నమయ్య జిల్లా రాయచోటి, కడప ఏడురోడ్లలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు.

ఏపీ సీఎం జగన్ రెడ్డి భూకబ్జా చట్టం ద్వారా ప్రజలను మోసం చేశారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఈ చట్టం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పట్టాదారు పాసు పుస్తకంపై జగన్‌ బొమ్మ పెట్టారని.. ప్రజలకు భూములు జగన్‌ తాత, నాన్న ఇచ్చారా? ఆస్తి మీదా? జగన్‌దా? ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్టు తీసుకువస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

Chandrababu slams ys jagan in rayachoty election campaign

ఆ చట్టం అమలైతే మీ భూములు మీవి కావు. భూములకు సంబంధించి నకలు పత్రాలు మీకు ఇస్తారు. భూమి రికార్డులు మార్చినందువల్ల చేనేత కార్మికుడి కుటుంబం విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. వైసీపీకి ఓటు వేస్తే మీ ఊరికి కూడా గొడ్డలి వస్తుంది. జాబు రావాలంటే బాబు రావాలి. గంజాయి కావాలంటే జగన్‌ ఉండాలని చంద్రబాబు తెలిపారు. తమ ప్రభుత్వం వస్తే ప్రజలు భూములను వారికే ఇస్తామన్నారు.

జగనన్న బాణం ఇప్పుడు రివర్స్‌ అయ్యిందన్న చంద్రబాబు.. తండ్రి ఆస్తిలో చెల్లికి వాటా కూడా ఇవ్వలేదని షర్మిల గురించి మాట్లాడుతూ జగన్‌ను దుయ్యబట్టారు. అన్న, చెల్లి ఇంట్లో పోరాడుకోవాలి కానీ, ఓట్లు చీల్చడం సరికాదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అధికారం మదంతో జగన్‌ అరాచకాలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.

కడప స్టీల్‌ ఫ్యాక్టరీకి రెండుసార్లు శంకుస్థాపన చేశారు.. నేను శంకుస్థాపన చేశాక మరోసారి శంకుస్థాపన చేశారని ఎద్దేవా చేశారు. రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు అంగుళమైనా కదిలిందా? అంటూ ప్రశ్నించారు. రాయలసీమలో ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా?, రాయలసీమ ద్రోహి జగన్‌కు ఓటు వేస్తారా? అని ప్రశ్నించారు చంద్రబాబు . నేరాలు-ఘోరాలు చేయడంలో జగన్‌ పీహెచ్‌డీ చేశారని, అభివృద్ధిలో జగన్‌ చేసింది శూన్యం అని విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+