చంద్రబాబు తాజా నినాదం: అందరికీ విద్యుత్తు, కల
హైదరాబాద్: విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ స్వయం సమృద్ధి సాధించి దేశంలోనే ప్రథమ స్థానం సాధించి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలవాలని కోరుకుంటున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అందరికీ విద్యుత్తు అనేది తన నినాదమని ఆయన చెప్పారు. రోజుకు 24 గంటలు విద్యుత్తు సరఫరా చేయాలనేది తన స్వప్నమని ఆయన అన్నారు.
విద్యుత్ వినియోగదారులు సంతృప్తి చెందేలా విద్యుత్ రంగాన్ని వృద్ధి చేస్తానని, గృహాలకు 247 విద్యుత్ సరఫరా చేయడం తన స్వప్నమని, ఇది నా డ్రీమ్ ప్రాజెక్టు అని చంద్రబాబు చెప్పారు. రాజస్థాన్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌లలో గృహాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేసే మోడల్ ప్రాజెక్టును కేంద్రం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకు కేంద్ర ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శి జ్యోతి అరోరా తన బృందంతో శుకవ్రారం హైదరాబాద్‌కు వచ్చారు.

శుక్రవారం ఉదయం ఏపీ జెన్‌కో కార్యాలయంలో ఇంధన శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆమె చంద్రబాబును లేక్‌వ్యూ అతిథి గృహంలో కలిశారు. ఈ ప్రాజెక్టు గురించి ఆయనకు సమగ్రంగా వివరించారు. ఇక. రాష్ట్ర విద్యుత్ రంగం గురించిన సమగ్ర సమాచారాన్ని ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆమెకు వివరించారు.
ఈ సమావేశం వివరాలను స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సీఈవో ఎ.చంద్రశేఖర రెడ్డి తెలిపారు. కేంద్రం ప్రయోగాత్మకంగా 247 గృహాలకు విద్యుత్ సరఫరా చేసే పథకాన్ని అమలు చేస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో సమూల మార్పులు చేసేందుకు చర్యలు తీసుకుంటోందని జ్యోతి అరోరాకు చంద్రబాబు వివరించారు. ‘గ్రీన్ పవర్' విధానానికి ప్రోత్సాహం ఇస్తూ పర్యావరణానికి మేలు చేసే విధంగా సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తామని చంద్రబాబు చెప్పారు.












Click it and Unblock the Notifications