చంద్రబాబు కేసులో సుప్రీంలో ఆసక్తికర పరిణామం - నాట్ బిఫోర్ మీ..!!

టీడీపీ అధినేత చంద్రబాబు కేసును సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేసు విచారణకు రాగానే న్యాయమూర్తి భట్టి ఈ కేసు విచారణకు సుముఖత వ్యక్తం చేయలేదు. నాట్ బిఫోర్ మీ అంటూ నిరాసక్తత వ్యక్తం చేసారు. దీంతో, చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే ఈ కేసును వెంటనే విచారణకు స్వీకరించాలని కోరారు. కానీ, మరో న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా జోక్యం చేసుకొని తన సహచర న్యాయమూర్తి భట్టి సుముఖంగా లేకపోవటంతో ఈ కేసును మరో బెంచ్ కు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు.

నాట్ బిఫోర్ మీ
తెలుగు దేశం అధినేత చంద్రబాబు(Chandra Babu)కు ఈ రోజు ఎలాంటి రిలీఫ్ రాలేదు. కేసు విచారణకు వస్తూనే ద్విసభ్య ధర్మాసనం బెంచ్ విచారణకు విముఖత వ్యక్తం చేసింది. దీంతో, మరో బెంచ్ కు బదిలీ చేస్తూ నిర్ణయం ప్రకటించింది. దీంతో, చంద్రబాబు తరపు న్యాయవాదులు కేసు వెంటనే విచారించాలని కోరుతూ అభ్యర్దించినా సాధ్యం కాలేదు. ఆ వెంటనే చంద్రబాబు తరపు న్యాయవాదులు చీఫ్ జస్టిస్ ముందు ఈ కేసు మెన్షన్ కు ప్రయత్నం చేస్తున్నారు. రేపటి నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు కోర్టుకు సెలవులు కావటంతో..వచ్చే నెల 3వ తేదీ తరువాతనే సుప్రీంలో ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Supreme Court Transfer Chandra Babu Case

వచ్చే వారం విచారణ
స్కిల్ లో దాఖలైన ఎఫ్ఐఆర్(FIR) పైన స్టే ఇవ్వాలని సుప్రీంను కోరారు. అదే విధంగా ఏసీబీ కోర్టు(ACB Court) విధించిన జ్యుడిషియల్ రిమాండ్ ను సస్పెండ్ చేయాలని అభ్యర్ధించారు. ఏదైతే ప్రస్తుత విచారణ ప్రొసీజర్ జరుగుతుందో అది పూర్తిగా నిలిపివేయాలని కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandra Babu) కేసులో హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. .స్కిల్‌ డెవల్‌పమెంట్‌ వ్యవహారంలో తనపై నమోదైన కేసును కొట్టివేయడానికి నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు(supreme Court) విచారణ చేపట్టింది. అత్యవసరంగా విచారించాలని ఆయన తరఫున న్యాయవాదులు దాఖలు చేసిన మెన్షన్‌ మెమోను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పరిగణనలోకి తీసుకున్నారు.

మరో బెంచ్ కు బదిలీ
జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌వీ భట్టిలతో కూడిన ధర్మాసనం దీనిని స్వీకరించింది. ధర్మాసనం ఎదుట బాబు పిటిషన్‌ 61వ కేసుగా లిస్టయింది. రాజకీయ దురుద్దేశాలతోనే కేసు నమోదు చేశారని, రిమాండ్‌ రిపోర్టులో ఎటువంటి ఆధారాలు చూపించకుండా అక్రమంగా అరెస్టు చేశారని చంద్రబాబు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 2018లో సవరించిన అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17(ఏ) ప్రకారం కేసు నమోదుకు గవర్నర్‌(governor) అనుమతి తీసుకోలేదని పిటీషన్ లో పేర్కొన్నారు. ఇదే అంశం పైన ఏపీ హైకోర్టులో నూ విచారణ జరిగింది. హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటీషన్(Quash Petition) ను కొట్టివేసారు. దీంతో, ప్రధానంగా మూడు అభ్యర్ధనలతో చంద్రబాబు సుప్రీంకోర్టు(Supreme Court)లో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసారు. కానీ, కోర్టులో ధర్మాసనం విచారణకు అంగీకరించకపోవటంతో ఈ కేసు వచ్చే వారం మరో బెంచ్ ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది,

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+