ఆ 'యువనేత'పై ప్రత్యేకంగా దృష్టిసారించిన చంద్రబాబు
ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గెలవడం అనేది చాలా ముఖ్యం. అధికారంలోకి రావడమే ప్రత్యామ్నాయం. మళ్లీ దీనికి ప్రత్యేకంగా ఏ ప్రత్యామ్నాయం లేదు. ఓటమిపాలై వైసీపీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఈసారి విజయమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారు. ఎప్పటికప్పుడు తన వ్యూహాలను మార్చుకుంటూ ముందుకు వెళుతున్నారు.

యువ మంత్రమే గెలుపుకు బాట
ఎన్నికల్లో గెలవాలంటే యువ మంత్రం పఠించాలి. యువతే ప్రధాన ఆకర్షణ. వారి ఓట్లను రాబట్టుకోవడానికి, పార్టీకి నూతన జవసత్వాలు కల్పించడానికి 40 శాతం సీట్లు యువతకే కేటాయించబోతున్నట్లు బాబు ప్రకటించారు. ఏయే నియోజకవర్గాల్లో యువతకు సీట్లివ్వాలనే అంశంపై ఆయన సర్వే చేయించుకొని నివేదికలు కూడా సిద్ధం చేశారు. తాజాగా ఆయన దృష్టి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో దూకుడుగా పనిచేస్తున్న యువనేత మామిడి గోవిందరావుపై పడింది. ఆయన పనితీరును నిశితంగా గమనిస్తున్నట్లు పార్టీవర్గాలు వెల్లడించాయి.

గోవిందరావువైపే మొగ్గుతున్న శ్రేణులు
పాతపట్నం నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిగా కలమట వెంకటరమణ ఉన్నారు. రెండు గ్రూపులుగా మారి పనులు చేస్తున్న వ్యవహారాన్ని తొందరగా తేల్చేద్దామన్న ధోరణిలో అధినేత ఉండటంతో గ్రూపు రాజకీయాలు కూడా జోరందుకున్నాయి. అయితే బాబు తెప్పించుకున్న సర్వేలో కలమట కన్నా మామిడికే పార్టీ శ్రేణుల నుంచి ఆదరణ దక్కుతోందని తేలింది. గోవిందరావు సొంత డబ్బులు ఖర్చుపెడుతూ అతి తక్కువ సమయంలోనే ప్రజలను ఆకట్టుకున్నారు. సీటు ఖరారు చేసే విషయంలో మరికొంత వేచిచూద్దామనే ధోరణిని ఆయన కనపరుస్తున్నారు.

టీడీపీకి అనుకూలంగా ఉందని తేలడంతో..
ఇటీవల విడుదలైన ఒక సర్వేలోఈ నియోజకవర్గం టీడీపీకి అనుకూలంగా ఉన్నట్లు తేలడం కలిసొచ్చేదిగా బాబు భావిస్తున్నారు. ఎక్కువ సమయం నాన్చితే పార్టీకే ఇబ్బంది అవుతుందని, ఇద్దరిలో సీటు ఎవరికో ఎన్నికల సమయంలో కాకుండా కనీసం ఆరునెలల ముందుగా ప్రకటించమని ఇక్కడి శ్రేణులు కోరుతున్నాయి. బాబు కూడా గతానికి భిన్నంగా ఈసారి అభ్యర్థులను ముందుగానే ఖారు చేసుకుంటూ వస్తున్నారు. చూద్దాం.. ఆయన ఎవరికి ఇక్కడ సీటు కేటాయిస్తారో..!!












Click it and Unblock the Notifications