అమరావతి, పోలవరం లేని రాష్ట్రాన్ని ఊహించలేం; రైతుల మహా పాదయాత్రతో పాలకులకు కనువిప్పు కలగాలన్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం టూ దేవస్థానం మహా పాదయాత్రకు తన మద్దతును ప్రకటించారు. ఐదు కోట్ల ప్రజల ఆత్మగౌరవానికి అమరావతి ప్రతీక అని పేర్కొన్న చంద్రబాబు నాయుడు ఇది పాదయాత్ర కాదని రాష్ట్ర పరిరక్షణ కోసం చేస్తున్న యాత్ర అంటూ పేర్కొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు ప్రకటన చేసిన తర్వాత నుండి రాజధానిగా అమరావతి నే కొనసాగించాలి నుంచి రాజధాని అమరావతి రైతులు ఆందోళనల బాట పట్టారు. అప్పటి నుండి రైతులు చేస్తున్న పోరాటానికి చంద్రబాబు తన సంపూర్ణ మద్దతును ప్రకటించి రైతులకు అండగా పోరాటం కొనసాగిస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం ప్రకటించిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు.
అమరావతిపై పాలకపక్షం ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా చలించని రైతులపై చంద్రబాబు
రాష్ట్ర భవిష్యత్తు కోసం కన్నతల్లి లాంటి భూముల్ని త్యాగం చేసిన పుడమితల్లి వారసులు చేస్తున్న ఉద్యమంగా అమరావతి ఉద్యమాన్ని అభివర్ణించిన టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి ఉద్యమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్నారు. అమరావతిపై పాలకపక్షం ఎన్ని అసత్య ప్రచారాలు, అవహేళనలు చేసినా, అవమానాలకు గురి చేసినా, చలించకుండా ఆశయ సాధన కోసం చేస్తున్న ఉద్యమం అమరావతి ఉద్యమం అని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ రైతుల పాదయాత్రకు మద్దతు తెలపాలంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు.
మహా పాదయాత్ర ద్వారా అయినా పాలకులకు కనువిప్పు కలగాలి
ఈ పాదయాత్ర ద్వారానైనా పాలకులకు కనువిప్పు కలగాలని పేర్కొన్న చంద్రబాబు ప్రజలు అమరావతిని కాపాడుకోకపోతే రాష్ట్ర భవిష్యత్ అంధకారంగా మారుతుంది అని ఆందోళన వ్యక్తం చేశారు.తెలుగు రాష్ట్రాల విభజన జరిగిన సమయంలో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందని, ఏపీ రాజధానిగా అమరావతి నిర్మాణంతో, స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చాలని ప్రయత్నం జరుగుతున్న తరుణంలో మూడు రాజధానులు తెర మీదకు తీసుకువచ్చి జగన్ రివర్స్ పాలనకు తెరలేపారని చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అహంకారంతో కళ్లుమూసుకు పోయిన ముఖ్యమంత్రి కళ్ళు ఇకనైనా తెరుచుకోవాలన్నారు.
అమరావతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది
జగన్.. పగలు, ప్రతీకారాలు, కక్షలు, కార్పణ్యాలు, దాడులు, ప్రతి దాడులు, కూల్చివేతలు, రద్దులపై పెడుతున్న శ్రద్ధ రాష్ట్రాభివృద్ధిపై పెట్టడం లేదని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలు భవిష్యత్తు కోసం ముందుచూపుతో ఆలోచించి తెలుగుదేశం పార్టీ నాడు నిర్ణయాలు తీసుకుందని పేర్కొన్న చంద్రబాబు అమరావతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. 1999లో విజన్ 2020తో నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దుకున్నామని,అభివృద్ధి చేసుకున్నామని పేర్కొన్నారు చంద్రబాబు .

విజన్ 2029 లో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని అమరావతి నిర్మాణం
విభజన అనంతరం విజన్ 2029 లో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో, రాజధాని అమరావతితో పాటుగా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి శ్రీకారం చుట్టామని చంద్రబాబు పేర్కొన్నారు. కానీ వైసిపి సర్కారు హయాంలో విజన్ 2029 అమలుపై గొడ్డలి వేటుతో బాధ కలుగుతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి, పోలవరం లేని రాష్ట్రాన్ని ఊహించలేమని పేర్కొన్న చంద్రబాబు ఐదు కోట్ల ప్రజల గుండెచప్పుడు, తెలుగుజాతి అఖండజ్యోతి అయిన అమరావతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు.

రాజధానిగా అమరావతి కొనసాగాలని రైతుల మహా పాదయాత్ర
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధానిగా చేయాలని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్న అమరావతి ప్రాంత రైతులు మహా పాదయాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో తుళ్లూరు నుంచి తిరుమల వరకు మహా పాదయాత్ర నిర్వహించనున్నారు రాజధాని ప్రాంత రైతులు. నవంబరు ఒకటవ తేదీ సోమవారం నుండి న్యాయస్థానం టు దేవస్థానం పేరిట అమరావతి రైతు మహా పాదయాత్ర ప్రారంభం అయ్యింది.

తొలిరోజు పాదయాత్ర ఇలా .. నవంబర్ 17 వరకు కొనసాగనున్న పాదయాత్ర
నవంబర్ 1వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల 5 నిమిషాలకు అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రారంభం కాగా మహా పాదయాత్రకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా తుళ్లూరు రైతు దీక్ష శిబిరంలో కాలభైరవ, లక్ష్మీ గణపతి, నవగ్రహ హోమాలు నిర్వహించారు. హోమానికి ముందు మహిళా రైతులు సర్వమత ప్రార్థనలు నిర్వహించి రాజధానిగా అమరావతి కొనసాగాలని ఆకాక్షించారు. యాత్రలో భాగంగా తొలిరోజు రైతులు ఏడు కిలోమీటర్ల దూరంలోని పెదపరిమికి చేరుకొని అక్కడ భోజనం చేసి ఇకఅక్కడ నుండి మరో ఏడు కిలోమీటర్లు నడిచి తాడికొండలో రాత్రికి బస చేస్తారు. ఈ మహా పాదయాత్ర నవంబర్ 1 నుండి నవంబర్ 17 వరకు జరగనుంది.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
ప్రజలు సహకరించాలి, ఏపీ ప్రభుత్వం ప్రత్యేక వినతి..!! -
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications