జగన్ లండన్ టూర్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు....లండన్‌కు ఎందుకు వెళ్లారంటే..?
Recommended Video

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. జగన్ లండన్ టూర్ వెనక పెద్ద రహస్యమే దాగి ఉందని అన్నారు చంద్రబాబు. కేవలం హవాలా డబ్బుల కోసమే జగన్ విదేశీ పర్యటన చేస్తున్నారని ఆరోపించారు. హవాలా డబ్బుల కోసమే జగన్ లండన్‌కు వెళ్లారని అన్న చంద్రబాబు ఎన్నికలకు ముందు ఎవరూ విదేశీ పర్యటనలకు వెళ్లరని లాజిక్ చెప్పారు చంద్రబాబు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. అధికార పక్షం ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుతున్నాయి. ఇప్పటికే టీడీపీ నుంచి పలువురు ఎంపీలు వైసీపీ కండువా కప్పుకోవడంతో ఈ హీట్ మరింత పెరిగింది. టీడీపీ నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఎంపీలు పసుపు పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తుండటంతో అంటే స్ట్రాంగ్‌గా రియాక్ట్ అవుతోంది టీడీపీ. ఎంపీల పనితీరు బాగోలేకపోవడంతో వారికి ఈసారి టికెట్ కేటాయించడం లేదన్న సంగతి అర్థమై వారు వైసీపీకి వెళ్లి టీడీపీపై విమర్శులు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇక టీడీపీ నుంచి కొందరు ప్రజాప్రతినిధులు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత వైయస్ జగన్ లండన్‌లో చదువుకుంటున్న తన కూతరును చూసేందుకు అక్కడికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు జగన్‌పై విమర్శలు గుప్పించారు. జగన్ లండన్ టూర్ పరమార్థం వేరని ఆయన చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా గురించి జగన్ బీజేపీని ఎందుకు ప్రశ్నించడం లేదని చంద్రబాబు సూటి ప్రశ్న వేశారు. ఇదిలా ఉంటే మరో మంత్రి దేవినేని ఉమా కూడా జగన్ పర్యటనపై ఆరోపణలు చేశారు. అసలు జగన్ లండన్‌లో రాజకీయాలు నడుపుతున్నారని ఆరోపించారు. జగన్‌తో పాటు ఆయన సతీమణి భారతి కూడా తమ కూతురును చూసేందుకు లండన్ వెళ్లారు.












Click it and Unblock the Notifications