పెద్దిరెడ్డి పై చంద్రబాబు లక్ష్యం నెరవేరేనా - అభ్యర్ధి ప్రకటన వెంటనే : అక్కడా అదే సీన్..!!

వచ్చే ఎన్నికల్లో టీడీపీ కొంత మంది వైసీపీ ముఖ్యుల పైన స్పెషల్ ఫోకస్ పెట్టింది. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా రాజకీయం చేస్తున్న మంత్రి పెద్దిరెడ్డిని ఎలాగైనా ఓడించాలనేది టీడీపీ అధినేత లక్ష్యం. ఇందులో భాగంగా... ఇప్పటికే పెద్దిరెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరు అభ్యర్ధి పైన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అన్నమయ్య..రాజంపేట పార్లమెంటరీ జిల్లాల పరిధిలో పార్టీ నేతలతో సమీక్షలు చేసిన చంద్రబాబు.. పుంగనూరు నియోజకవర్గ బాధ్యుడు చల్లా బాబును అభ్యర్థిగా ప్రకటించారు.

పుంగనూరు అభ్యర్ధి ప్రకటన

పుంగనూరు అభ్యర్ధి ప్రకటన

2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్ధిగా అనీషా రెడ్డి పోటీ చేసారు. 40 వేల ఓట్లకు పైగా మెజార్టీతో పెద్దిరెడ్డి గెలుపొందారు. ఇప్పుడు టీడీపీ అధినేత ఇక్కడ నుంచి చల్లా బాబును అభ్యర్థిగా ప్రకటించటంతో అక్కడే ఉన్న బోయకొండమ్మ ఆలయం కమిటీ మాజీ ఛైర్మన్‌ ఎస్‌కే రమణారెడ్డి తన వర్గీయులతో చల్లా బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభ గందరగోళంగా మారడంతో రమణారెడ్డి తన వర్గీయులతో బయటకు వెళ్లిపోయారు. అదే విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకానాధ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న తంబళ్లపల్లె నియోజకవర్గ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. శంకర్‌యాదవ్‌ గురించి చెబుతుండగా ఆయన అనుకూల, వ్యతిరేక వర్గీయులు పోటాపోటీ నినాదాలు చేశారు. ఇక, కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ సమీక్ష సమావేశంలో బత్యాల చెంగల్‌రాయుడు, జగన్మోహన్‌రాజుల అనుచరులు పోటాపోటీగా నినాదాలు చేయడం చూసి ఆగ్రహం వ్యక్తం చేసారు.

టీడీపీలో అంతర్గత విభేదాలు

టీడీపీలో అంతర్గత విభేదాలు

రైల్వేకోడూరు నియోజకవర్గం సమీక్షలోనూ కస్తూరి విశ్వనాథనాయుడు వర్గీయులు బత్యాల చెంగల్‌రాయుడు వర్గీయుల మధ్య నినాదాలు జోరుగా సాగాయి. ఇక వైపు తన సొంత జిల్లాలో పెద్దిరెడ్డి ఆధిపత్యానికి చెక్ పెట్టటం ద్వారా పూర్తిగా వైసీపీని ఆత్మ రక్షణలో పడేయాలనేది చంద్రబాబు వ్యూహం. కానీ, అభ్యర్ధి ఎంపిక సమయంలోనే వివాదాలు - గొడవలు చేయటం..అందునా పార్టీ అధినేత సమక్షంలోనే బాహాబాహీకి దిగటం ఇప్పుడు పార్టీలో చర్చకు కారణమైంది. ఈ సమావేశంలోనే పెద్దిరెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. పుంగనూరు నియోజకవర్గం తెదేపాకు కంచుకోటగా పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో 100కు 150 శాతం ఇక్కడ గెలుస్తామంటూ చెప్పుకొచ్చారు.కార్యకర్తలు సింహాల్లా బయటకొచ్చి వైసీపీ అక్రమాలను ప్రశ్నిస్తుండటంతో మంత్రి పెద్దిరెడ్డిలో భయం మొదలైందన్నారు.

చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి

చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి

మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికే ఎమ్మెల్యేలు, ఎంపీల పదవులతో పాటు గుత్తేదారు పనులూ కావాలా అంటూ ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే మంత్రి పెద్దిరెడ్డి స్వాహాచేసిన ఆస్తులన్నీ స్వాధీనం చేసుకుంటామని చెప్పుకొచ్చారు. అటు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును ఓడిస్తామంటూ పదే పదే మంత్రి పెద్దిరెడ్డి చెబుతూ వస్తున్నారు. ఇక, ఎన్నికలకు ముందుగానే కేడర్ ను సిద్దం చేసే క్రమంలో చంద్రబాబు ముందుగా తన సొంత జిల్లా - సీఎం జగన్ ఇలాకా అయిన చిత్తూరు - కడప జిల్లాల పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. కానీ, చంద్రబాబు సమక్షంలోనే చోటు చేసుకుంటున్న పరిణామాలతో రానున్న ఎన్నికల్లో చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా పార్టీ శ్రేణులు పని చేస్తారా లేదా ..పెద్దిరెడ్డి నియోకజవర్గంలో ఏం జరగబోతుందనే ఉత్కంఠ రాజకీయంగా మొదలైంది.


Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+