వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంచి జరుగుతుందనే ప్రజలు ఓపిగ్గా సహకరిస్తున్నారు: చంద్రబాబు

భవిష్యత్తులో తమకు మంచి జరుగుతుందన్న ఉద్దేశ్యంతోనే ప్రజలంతా ఓపిగ్గా సహకరిస్తున్నారని, ఈ నెలాఖరుకల్లా సమస్యలన్ని పరిష్కారం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: రాష్ట్రంలో పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలను ముమ్మరం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. వార్దా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఏపీలో చేపడుతున్న సహాయక చర్యలపై చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఇదే సందర్బంగా నగదు రహిత లావాదేవీలపై కూడా అధికారులతో చంద్రబాబు చర్చించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు నగదు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మరో రెండు రోజుల్లో రాష్ట్రానికి మరింత నగదు చేరనుందని.. ఆలోగా ఉన్న నగదను బ్యాంకర్లు సక్రమంగా పంపిణీ చేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు.

Chandrababu teleconference with officials over cashless economy and varadah

భవిష్యత్తులో తమకు మంచి జరుగుతుందన్న ఉద్దేశ్యంతోనే ప్రజలంతా ఓపిగ్గా సహకరిస్తున్నారని, ఈ నెలాఖరుకల్లా సమస్యలన్ని పరిష్కారం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. బ్యాంకులకు మూడు రోజుల వరుస సెలవుల కారణంగా.. ప్రస్తుతం బ్యాంకుల ఎదుట రద్దీ విపరీతంగా ఉందని, అందుకు తగ్గట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

నగదు రహిత లావాదేవీలకు ప్రజలను అలవాటు చేయాలని.. ఇందుకోసం రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించ కార్యక్రమాలు చేపట్టాలని టెలికాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు అధికారులను కోరినట్టు తెలుస్తోంది. అలాగే వచ్చే నెల నుంచి రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో నగదు రహిత లావాదేవీలు జరిగేలా చూడాలని అధికారులను కోరారు.

English summary
AP CM Chandrababu naidu addressed the teleconference over cyclone varadah and cashless economy. He said people are co-operating with patience
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X