• search
  • Live TV
నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జగన్ ఇలాఖాలో చంద్రబాబు; అసెంబ్లీ బహిష్కరణ తర్వాత.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న టీడీపీ చీఫ్

|
Google Oneindia TeluguNews

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద ప్రభావానికి గురైన ప్రాంతాలలో పర్యటిస్తున్నారు.చంద్రబాబు అసెంబ్లీలో తనకు అవమానం జరిగిందని తీవ్ర ఆవేదనకు గురైన తర్వాత జరుగుతున్న పర్యటన కావడంతో ఈ పర్యటన పై ఆసక్తి నెలకొంది. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు కడపకు చేరుకోవడంతో కడపలో పార్టీ శ్రేణులు ఆయనను స్వాగతించారు.

జగన్ గాల్లోంచి నేలకు దిగు ... జ‌నం వ‌ర‌ద క‌ష్టాలు క‌నిపిస్తాయి: విరుచుకుపడ్డ లోకేష్జగన్ గాల్లోంచి నేలకు దిగు ... జ‌నం వ‌ర‌ద క‌ష్టాలు క‌నిపిస్తాయి: విరుచుకుపడ్డ లోకేష్

జగన్ ఇలాఖాలో చంద్రబాబు పర్యటన ,.. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత

జగన్ ఇలాఖాలో చంద్రబాబు పర్యటన ,.. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత

జగన్ ఇలాఖాలో ఈరోజు చంద్రబాబు పర్యటన కొనసాగనున్న నేపథ్యంలో కడపలో పార్టీ శ్రేణులు విమానాశ్రయం వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు రాజంపేట, నందలూరు మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్ళారు. ప్రస్తుతం చంద్రబాబు పులపత్తూరు, మందపల్లి, జోగిపేట, తోగూరు పేట, గుండ్లూరు గ్రామాల్లో బాధితులను పరామర్శించి అక్కడి పరిస్థితిని వారిని అడిగి తెలుసుకోనున్నారు. ఏపీలో కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా జనజీవనం అతలాకుతలం అయ్యింది. చాలా మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరదల ప్రభావంతో చాలా మంది నిలువ నీడ లేని వారయ్యారు. కడప జిల్లా రాజంపేటలో భారీ వర్షాలు తీవ్ర విషాదం నిపాయి. వరదల్లో 30 మంది గల్లంతు కాగా 26 మంది మృతి చెందినట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక బాధిత కుటుంబాలను చంద్రబాబు పరామర్శించనున్నారు.

అసెంబ్లీని బహిష్కరించిన తర్వాత సీఎం సొంత జిల్లాలో బాబు తొలి పర్యటన

అసెంబ్లీని బహిష్కరించిన తర్వాత సీఎం సొంత జిల్లాలో బాబు తొలి పర్యటన

జగన్ సొంత జిల్లాలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. చంద్రబాబు అసెంబ్లీని బహిష్కరించిన తర్వాత జరుగుతున్న తొలి పర్యటన కావడంతో ఈ పర్యటనపై ఆసక్తి నెలకొంది. మొదట చంద్రబాబు పర్యటనలో ఈరోజు కడప, తిరుపతిలో పర్యటన కొనసాగాల్సి ఉండగా వరద తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పర్యటనలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబు ఈరోజు కడపలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, రేపు చిత్తూరు జిల్లాలో,ఎల్లుండి నెల్లూరు జిల్లాలో పర్యటనను కొనసాగించనున్నారు.

వరదల తీవ్రతతో షెడ్యూల్ లో మార్పులు .. ఎన్టీఆర్ ట్రస్ట్, టీడీపీ శ్రేణుల వరద సహాయం

వరదల తీవ్రతతో షెడ్యూల్ లో మార్పులు .. ఎన్టీఆర్ ట్రస్ట్, టీడీపీ శ్రేణుల వరద సహాయం


మొదటి రెండు రోజులే పర్యటన అని చెప్పినా ఇప్పుడు మరొక రోజు అదనంగా పొడిగించి మూడు రోజుల పాటు చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు .ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ఎన్టీఆర్ ట్రస్టు సభ్యులు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలను చేపట్టారు. వరద ముంపులో చిక్కుకున్న వారికి ఆహార పొట్లాలను అందిస్తూ సేవలను కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో వరద సహాయక చర్యలకు వరద ప్రభావిత ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు కదలిరావాలని, కష్టాల్లో ఉన్న ప్రజలకు సహాయం అందించాలని, వారికి కావలసిన ఆహారాన్ని, మందులను సరఫరా చేయాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారన్న విషయం తెలిసిందే. జలదిగ్బంధంలో చిక్కుకున్న ప్రజలకు టిడిపి శ్రేణులు అండగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

వరద పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు

వరద పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే వరద సహాయక చర్యలు వైసిపి ప్రభుత్వం విఫలమైందని, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయలేదని జగన్ సర్కార్ ను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటే ఇంత ప్రాణ నష్టం , ఆస్తి నష్టం జరిగేవి కావని పేర్కొన్నారు చంద్రబాబు. అపారమైన పంట నష్టం వాటిల్లిందని పేర్కొన్న చంద్రబాబు వరదల పరిస్థితి, నిరాశ్రయులైన వారి స్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నేడు, రేపు కూడా వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపధ్యంలో ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది.

English summary
Chandrababu went for a visit the flood affected areas in kadapa. After the assembly boycott, TDP chief Chandrababu is touring the flood affected areas.Chandrababu will visit flood victims in Rajampeta, Nandaluru mandals of Kadapa district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X