మళ్లీ అసెంబ్లీ బరిలో ఆ ఇద్దరు సీనియర్లు - చంద్రబాబు నిర్ణయం..!!
ఎన్నికల వేళ టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అభ్యర్ధుల ఖరారు పై ఫోకస్ పెట్టారు. ఇద్దరు మాజీ మంత్రులను అసెంబ్లీ బరిలో నిలపాలని నిర్ణయించారు. ఎన్నికల సమాయత్తంలో భాగంగా ఈ నెల 5వ తేదీ నుంచి మూడు జోనల్ స్థాయి సదస్సుల నిర్వహణకు నిర్ణయించారు.
అదే సమయంలో ముందుగా అసెంబ్లీ అభ్యర్దుల ఎంపిక పైన ఫోకస్ చేసిన చంద్రబాబు...లోక్ సభ అభ్యర్దుల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పొత్తులు - సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్దులను ఫైనల్ చేయనున్నారు.

అసెంబ్లీకే అశోక్ గజపతి రాజు
టీడీపీ సీనియర్ నేత..కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజును తిరిగి అసెంబ్లీకి పోటీ చేయాలని చంద్రబాబు సూచించారు. ఈ మేరకు సిద్దం కావాలని స్పష్టం చేసారు. సుదీర్ఘకాలం విజయనగరం ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పని చేసారు. 2014 లో విజయనగరం ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. గత ఎన్నికల్లో ఆయన కుమార్తె విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
ఏపీలో ప్రభుత్వం మారిన తరువాత అశోక్ గజపతి రాజు పైన అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ సారి ఎన్నికల్లోనూ తిరిగి తన కుమార్తెను బరిలోకి దించాలని ఆయన ఆశించారు. ఇదే సమయంలో చంద్రబాబు ఆయనతో నేరుగా మాట్లాడారు. అసెంబ్లీ బరిలోకే దిగాలని స్పష్టం చేసారు. దీనికి అశోక్ గజపతి రాజు కూడా అంగీకరించారు. దీంతో..విజయనగరం నుంచి ఆయన తిరిగి పోటీకి రంగం సిద్దం అవుతోంది.

నెల్లూరు నుంచి నారాయణ పోటీ
మాజీ మంత్రి నారాయణ మరోసారి నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో ఆయన ఇదే స్థానం నుంచి పోటీ చేసి వైసీపీ నేత అనిల్ చేతిలో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో టీడీపీ విజయానికి నారాయణ కీలకంగా వ్యవహరించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి అయ్యారు. కీలకమైన మున్సిపల్ శాఖను కేటాయించిన చంద్రబాబు అమరావతి బాధ్యతలు అప్పగించారు.
2019 ఎన్నికల్లో ఓటమి తరువాత అమరావతితో పాటుగా నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి అనేక కేసులు నారాయణ మీద నమోదయ్యాయి. దీంతో, ఆయన రాజకీయాలకు దూరం అవుతున్నారనే ప్రచారం సాగింది. నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంటున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తిరిగి నారాయణకు నెల్లూరు సిటీ సీటు కేటాయిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు సర్వేలు కూడా టీడీపీకి అనుకూలం గా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది.
ఎంపీ అభ్యర్దుల ఎంపికలో..
అటు జనసేనతో పొత్తు దిశగా అడుగులు పడుతున్న వేళ..చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఖరారు చేసిన చంద్రబాబు.. మరి కొన్ని కీలక నియోజకవర్గాల్లోనూ అభ్యర్ధులను ఎంపిక చేసారు. అదే సమయంలో ఎంపీల విషయంలో మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ స్థానాల్లో గెలుపు కీలకం కావటంతో గెలుపు గుర్రాలనే ఎంపిక చేస్తున్నారు.
పొత్తులు ఖరారు అయిన తరువాత సామాజిక - ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా ఎంపీల అభ్యర్దులను ఎంపిక చేయనున్నారు. ఈ నెల మొదటి వారంలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు జోనల్ సదస్సులను టీడీపీ నిర్వహించున్నారు. 5న విశాఖపట్నం, 6న కడప, 7న నెల్లూరుల్లో ఇవి జరుగుతాయి. వీటి ద్వారా ఎన్నికలకు పార్టీ కేడర్ ను సంసిద్దులను చేసేందుకు చంద్రబాబు సిద్దం అవుతున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications