వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమ్ముళ్లకు బాబు వార్నింగ్: మళ్లీ ఇదే రిపీటైతే చర్యలు తప్పవ్!..

శుక్రవారం జరిగిన నవనిర్మాణ దీక్షకు ఎవరెవరు రాలేదన్న జాబితా బయటకు తీయగా.. 12మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎంపీలు గైర్హాజరైనట్లు చంద్రబాబు దృష్టికి వచ్చింది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఓవైపు తెలంగాణ జనం ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటుంటే.. మరోవైపు ఏపీకి మాత్రం ఇది చీకటి దినం అని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాజధాని అమరావతిలో శుక్రవారం నవనిర్మాణ దీక్ష చేపట్టారు.

నవనిర్మాణ దీక్షకు జనం నుంచి ఎలాంటి స్పందన వచ్చిందన్నది పక్కనపెడితే.. కొంతమంది సొంత పార్టీ నేతలే ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారట. దీంతో విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు సదరు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులే డుమ్మా కొడితే ఎలా? అని ఆయన మండిపడినట్లు చెబుతున్నారు.

chandrababu

శుక్రవారం జరిగిన నవనిర్మాణ దీక్షకు ఎవరెవరు రాలేదన్న జాబితా బయటకు తీయగా.. 12మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎంపీలు గైర్హాజరైనట్లు చంద్రబాబు దృష్టికి వచ్చింది. మరోసారి ఇలాంటి అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించబోనని ఆయన తేల్చి చెప్పారట. శనివారం నుంచి ఏడో తేదీ వరకు కచ్చితంగా నేతలంతా పాల్గొనాల్సిందేనని గట్టిగా హెచ్చరించారట. ఇప్పటికీ తన వ్యాఖ్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే దానికి మూల్యం తప్పదని కూడా చెప్పారట.

ఏదేమైనా నిత్యం క్రమశిక్షణ మంత్రాన్ని జపించే చంద్రబాబు లాంటి నేతలకు సొంత గూటి నేతలే దాన్ని లెక్క చేయకపోవడం పట్ల అసహనంతో ఉన్నారట. క్రమశిక్షణ తప్పుతున్న తమ్ముళ్లను దారిలో పెట్టాలంటే ఇలాంటి హెచ్చరికలు తప్పవని భావిస్తున్నారట.

English summary
AP CM Chandrababu was little unhappy on party Mla's and ministers who not attends for Nava Nirmana Deeksha on friday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X