పులివెందుల ప్రకంపనలు: అత్యాచారం..హత్య కిరాతకం: వైసీపీ ప్రమేయం: డీజీపీకి చంద్రబాబు లేఖ
అమరావతి: కడప జిల్లా పులివెందులలో చోటు చేసుకున్న దళిత మహిళపై అత్యాచారం, హత్య ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే మహిళలకు రక్షణ కరవైందని అన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాశారు.

ప్రభుత్వ వైఫల్యం వల్లే..
శాంతిభద్రతలను పరిరక్షించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందడానికి పులివెందుల హత్యోదంతం ఓ నిదర్శనమని పేర్కొన్నారు. ఈ హత్యోదంతం చోటు చేసుకున్నది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో కావడం వల్ల నిందితులను కాపాడటానికి స్థానిక నాయకులు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వం, పోలీసు వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం కలిగించడానికి ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు.

అమాయకులను ఇరికించే ప్రయత్నం..
ఈ తరహా ఘటనలు ప్రజలను భయభ్రాంతులు గురి చేస్తున్నాయని, నాగమ్మ కేసులో నిందితులపై కఠిన చట్టాలను ప్రయోగంచాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పారు. అసలు నిందితులను కాపాడే ప్రయత్నంలో అమాయకులను ఈ కేసులో ఇరికిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. నాగమ్మ హత్యోదంతంతో ఏ మాత్రం సంబంధం లేని వారి పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చినట్లు కనిపిస్తోందని అన్నారు. దీనివల్ల- మరిన్ని అత్యాచారాలకు పాల్పడటానికి అసలు నిందితులకు అవకాశం కల్పించినట్టవుతుందని హెచ్చరించారు.

అధికార పార్టీ అండదండలు..
రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా ఘటలన్నింట్లోనూ నిందితులకు అధికార పార్టీ అండదండలు లభిస్తున్నాయని ఆరోపించారు. దళిత, గిరిజన, మైనారిటీ మహిళలే లక్ష్యంగా దండగులు దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. అధికార పార్టీ నాయకులు తమ అండగా ఉన్నారనే ధైర్యంతోనే నేరగాళ్లు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. శాంతిభద్రతలు అదుపు తప్పాయని, అందుకే దారుణ సంఘటనలు పునరావృతం అవుతున్నాయని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.
Recommended Video

మానవ హక్కుల దినోత్సవం రోజైనా..
మానవ హక్కుల దినోత్సవం నాడైనా మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని చంద్రబాబు కోరారు. నాగమ్మ హత్యోదంతంలో అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందనే విషయం స్పష్టమౌతోందని, అయినప్పటికీ.. వారిపై కేసులను నమోదు చేయడానికి పోలీసులు వెనుకాడుతున్నారని అన్నారు. వారి ఆగడాలను ఎప్పటికప్పుడు అడ్డుకోలేకపోతే.. ఇలాంటి హత్యలు మరిన్ని చోటు చేసుకోవడానికి పరోక్షంగా అవకాశం కల్పించినట్టవుతుందని చెప్పారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కఠిన చట్టాలు రూపొందించాలని,. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications