సాయం చేయాలి, మోడీ చేస్తారు, ఇంటికో సాఫ్టువేర్ ఇంజనీర్!: బాబు
విశాఖ: విశాఖలో శనివారం నాడు ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మేడిన్ ఏపీ బ్రాండ్ లక్ష్యమని చెప్పారు. పడిలేచే కెరటాలే మనకు స్ఫూర్తి అన్నారు. వచ్చే ఏడాదికి రెండంకెల వృద్ధికి చేరుకోవడమే లక్ష్యమన్నారు.
సముద్రం ఎంత లోతైనదో రాష్ట్ర ప్రజల మనస్సు అంత లోతైనదన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త, ఒక సాఫ్టువేర్ ఇంజనీర్ ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. ప్రతి ఇంటికి ఆప్టిక్ పైబర్ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని, అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తామన్నారు.
ప్రాధాన్య క్రమంలో ఏడు ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. విద్యారంగ కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. సంక్షోభాలను సవాలుగా మార్చుకుంటామన్నారు. రాజధానికి ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. కాంగ్రెస్ అడ్డగోలుగా విభజించిందని, మనం ఇప్పుడు కసితో పని చేయాలన్నారు.
ప్రధాని మోడీ ఏపీని అన్ని విధాలుగా ఆదుకుంటారన్న నమ్మకం ఉందన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు చెప్పారు. అభివృద్ధిని వికేంద్రీకరిస్తామన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పిల్లలు కూడా ఆలోచించాలన్నారు.

చంద్రబాబు
శాఖలో శనివారం నాడు ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు జెండాను ఆవిష్కరించారు.

చంద్రబాబు
తాను నిమిత్తమాత్రుడినని, తనకు శక్తి, ప్రేరణ ప్రజలేనని, వారి సహకారంతోనే నవ్యాంధ్ర సాధిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు
విశాఖ ఆర్‌కె బీచ్‌లో 69వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం కన్నుల పండువగా జరిగాయి. దేశంలోనే తొలిసారిగా సాగర తీరంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన సిఎం చంద్రబాబు పతాకావిష్కరణ చేసి, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

చంద్రబాబు
మహామహుల త్యాగాల ఫలమే మన స్వేచ్ఛా జీవనానికి కారణమన్నారు. రాష్ట్రం ఏర్పడి ఏడాది దాటిందని, తాను ప్రభుత్వపగ్గాలు చేపట్టే సమయానికి ఆర్థిక, విద్యుత్ సంక్షోభంలో రాష్ట్రం ఉందన్నారు.

చంద్రబాబు
గత పదేళ్ళలో కాంగ్రెస్ పాలనే ఈ సంక్షోభాలకు కారణమన్నారు. సముద్రం కన్నా గంభీరమైన వారు, లోతైనవారు, ఆవేశం కలిగిన వారు తెలుగు ప్రజలని కితాబునిచ్చారు.

చంద్రబాబు
తెలుగు ప్రజలు ఎప్పుడూ రాష్ట్రం విడిపోవాలని కోరుకోలేదని, అశాస్ర్తియ విభజనకు గత ప్రభుత్వాలు పూనుకొన్నాయి, అన్యాయంగా ఆస్తుల పంపిణీ జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు
తెలుగువారిని కించపరిచే విధంగా స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని విభజించారని దుయ్యబట్టారు. రాజధాని లేదు. విద్యా సంస్థలు లేవు. పరిశ్రమలు, వౌలిక సదుపాయాల్లేవు. ఇటువంటి సమయంలో రాష్ట్రానికి కేంద్రం ఉదారంగా చేయూత అందించాల్సిన అవసరం ఉందన్నారు.

చంద్రబాబు
కేంద్రంలోని నరేంద్ర మోడీ తప్పక సహరిస్తారన్న నమ్మకం తనకుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది కోరుకున్న విభజన కాదుకాబట్టి కేంద్రం వీలైనంత సహకారాన్ని అందించాలన్నారు.

చంద్రబాబు
తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో సమానంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందేవరకూ కేంద్రం చేయూనతివ్వాలని కోరారు.

చంద్రబాబు
తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా రాజధాని నిర్మాణాన్ని చేపడతామన్నారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

చంద్రబాబు
భోగాపురం విమానాశ్రయంకు కూడా రైతులు ఉదారంగా భూములివ్వాలని, వారి జీవనోపాధికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

చంద్రబాబు
35 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేశామని చెబుతూ, కరవురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామన్నారు.

చంద్రబాబు
పోలవరం పూర్తి కావడానికి చాలా సమయం పడుతుందని, ఈలోగా కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి చరిత్ర సృష్టిస్తామన్నారు.

చంద్రబాబు
రాష్ట్రంలో హంద్రీనీవా, గాలేరు-నగరి, తోటపల్లి వంటి ఏడు ప్రాజెక్ట్‌లను త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. యువతకు అన్నిరంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తున్నామని చెప్పారు.

చంద్రబాబు
డ్వాక్రా మహిళలకు 10 వేల కోట్ల పెట్టుబడి నిధిని మంజూరు చేశామన్నారు. ఇసుక విక్రయం, ధాన్యం కోనుగోలు, జనరిక్ మందుల అమ్మకాల బాధ్యత డ్వాక్రా మహిళలకు అప్పగించామన్నారు.

చంద్రబాబు
త్వరలోనే బీసీలకు చెందిన అన్ని రకాల రుణాలూ మాఫీ చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజన కుటుంబాల సంక్షేమానికి రెండు వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు.

చంద్రబాబు
అగ్రవర్ణాల్లోని కాపులను బీసీల్లోకి చేర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, బ్రాహ్మణుల కోసం 50 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేశామన్నారు.

చంద్రబాబు
రాష్ట్రంలో మళ్లీ జనతా వస్త్రాలు ప్రవేశపెడతామని, సగం ధరకే చీరా, ధోవతి పేదలకు అందివ్వనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలోని చేనేతలను అన్నివిధాలా ఆదుకుంటామన్నారు.

చంద్రబాబు
విశాఖను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని, విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలో కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.

చంద్రబాబు
ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు నిర్మిస్తామని, రాష్ట్రంలో ఎనర్జీ, వాటర్, స్పోర్ట్స్, లాజిస్టిక్, టూరిజం, ఆక్వా తదితర వర్శిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే స్వాతంత్య్ర దినోత్సవానికి రాష్ట్రాన్ని డబుల్ డిజిట్ గ్రోత్‌కు తీసుకెళ్తామన్న ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications