విశాఖను పునర్నిర్మిస్తాం: బాబు, ఎయిర్‌లైన్స్ హబ్

విశాఖపట్నం: హుధుద్ తుఫానుకు ధ్వంసమైన విశాఖపట్నం నగరాన్ని పునర్నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, మహిళలకు వరాల జల్లు కురిపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే పీఆర్సీని అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. సోమవారం విశాఖ జిల్లా సబ్బవరం మండలం ఆరిపాక పంచాయతీ లగిశెట్టిపాలెంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ప్రకటించారు. రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లినప్పుడు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధులతో మాట్లాడానని, విశాఖలో ఎయిర్‌లైన్స్‌ హబ్‌ ఏర్పాటు చేయడానికి వారు మందుకు వచ్చారన్నారు. హైదరాబాద్‌, బెంగళూరు నగరాలకు మించి విశాఖను అబివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు.

Chandrababu Naidu

త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో వేతన సవరణపై చర్చించి కేబినెట్‌ సబ్‌ కమిటీ వేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఉత్తరాంధ్రలో తుఫాన్‌ పునరావాస కార్యక్రమాల్లో ఉద్యోగులు బాగా సహకరించారని ఆయన కొనియాడారు. స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా సబ్బవరంలో ఆయన చీపురు పట్టుకుని వీధులను శుభ్రం చేశారు. మూడు జిల్లాల అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాని చెప్పారు.

మహిళలు విద్యావంతులు కావలసిన అవసం ఉందన్నారు. జన్మభూమిలో పాల్గొన్న మహిళలను ఎంతమంది వద్ద సెల్‌ఫోన్లు ఉన్నాయంటూ ప్రశ్నించారు. చాలామంది మహిళలు చేతులెత్తారు. ఆ వెంటనే మరుగుదొడ్లు, చదువు గురించి అడగ్గా చాలా మంది చేతులు లేపలేదు. దీంతో ఆయన చాలా మంది చదువుకున్నట్లు లేదంటూ డ్వాక్రామహిళలు విద్యావంతులు కావలసిన ఆవశ్యకతను వివరించారు. డ్వాక్రా మహిళలకు ఐదో తరగతి నుంచి పీజీ వరకు చదువుకునేలా ప్రోత్సహిస్తామన్నారు. పేదరికాన్ని తరిమేయాలంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రతి మహిళా జన్‌ధన్‌ బ్యాంక్‌ ఖాతా తెరవాలని చంద్రబాబు సూచించారు. జన్‌ధన్‌ ఖాతా వల్ల ఖాతాలో డబ్బులు లేకున్నా ఐదు వేల రూపాయల వరకూ అత్యవసర సమయంలో వాడుకునే సౌలభ్యం తో పాటు, బీమా సౌకర్యం కూడా ఉంటుందని వివరించారు. డ్వాక్రా సభ్యులకు ఒక్కొక్కరికి రూ. పది వేలు ఇస్తామన్నారు.

దేశ ఆర్థికాభివృద్ధికి గ్రామాలే పట్టుగొమ్మలని, అటువంటి గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని పాలకులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. అభివృద్ధికి సర్పంచ్‌, సభ్యులు, డ్వాక్రా మహిళలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి చర్చించుకుని ప్రణాళికలు తయారుచేయాలన్నారు. గ్రామానికి మరుగుదొడ్లు, రోడ్లు, పాఠశాల భవనాలు, తాగునీరు వంటి అంశాలతో వాటిని తయారుచేయాలన్నారు. రాష్ట్రంలో ఉన్న 13 వేల గ్రామ పంచాయతీలు ప్రణాళికలు రూపొందిస్తే అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. ఇంకా జిల్లా, రాష్ట్రస్థాయి ప్రణాళికలకూ నిర్ణయించామన్నారు.

తీవ్రపెనుతుఫాన్‌ హుధుద్‌తో ఉత్తరాంధ్ర ప్రజలు తీవ్ర కష్టాలు చవిచూశారని అన్నారు. తుఫాను ధాటికి ఉత్తరాంధ్ర రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారికి నష్టపరిహారం అందజేస్తామని అన్నారు. కల్లుగీత కార్మికులకు ఈ ఏడాది పన్ను రద్దు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

నవంబర్ 11 స్నాప్‌డీల్ డీల్ పొదుపు రోజు, 90% వరకు ఆఫ్, త్వరపడండి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+