చింతమనేనికి చంద్రబాబు హెచ్చరిక: వనజాక్షి దూకుడంటూ ట్విస్ట్

హైదరాబాద్‌/ ఏలూరు : ఇసుక క్వారీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మహిళా అధికారి వనజాక్షిపై దాడితో జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని, నాయకత్వ లక్షణాలున్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు మంచిది కాదని సీఎం హితవు పలికారు.

ఇసుక క్వారీపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి దూకుడు తగ్గించుకోవాలని చింతమనేనిని మందలించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని సీఎం హెచ్చరించారు. వనజాక్షిపై దాడి వివాదాన్ని చంద్రబాబు శనివారం పరిష్కరించిన విషయం తెలిసిందే.

ఇదిలావుండగా రెవెన్యూ సిబ్బందితో తమపై దాడి చేసి, కొట్టించిన తహసీల్దార్‌ వనజాక్షిని ఉద్యోగం నుంచి తొలగించాలని డ్వాక్రా మహిళలు డిమాండ్‌ చేశారు. ఏలూరులోని జడ్పీ గెస్ట్‌హౌస్‌లో టీడీపీ నాయకులు, డ్వాక్రా మహిళలు సమావేశమయ్యారు. తాము మహిళలం కాదా, తమపై దాడి చేయించారని డ్వాక్రా మహిళలు విమర్శించారు. తమకు న్యాయం జరగకపోతే తాము సీఎంను కలుస్తామని వారు చెప్పారు.

Chandrababu warns Chinatamaneni Prabhakar, DWCRA women opose Vanajakshi

కాగా, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దుల్లో చెలరేగిన ఇసుకు వివాదం కొత్త మలుపు తిరిగింది. కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్‌ వనజాక్షి సరిహద్దులను పోల్చుకోలేక పశ్చిమగోదావరి జిల్లాలోకి వచ్చారని పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు అంటున్నారు. తన జిల్లా సరిహద్దులు దాటి వచ్చిన తహసీల్దార్‌కు విజయరాయి రీచ్‌లో ఎమ్మెల్యే మనుషులతో గొడవ జరిగిందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌కు సమర్పించిన నివేదికలో తెలిపారు.

తహసీల్దార్‌గా ఉన్న వ్యక్తి వివాదాస్పద అంశాలపై చర్యలకు సిద్ధమవుతున్నప్పుడు సొంత జిల్లా ఉన్నతాధికారులకు గానీ ఏలూరు ఆర్‌డీవోకు గానీ సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని, కానీ తనకందిన ప్రాథమిక సమాచారంతోనే తహసీల్దార్‌ వనజాక్షి కాస్తంత దూకుడుగా వ్యవహరించారని తాజా సమాచారం.

తమ్మిలేరులో ఇసుక తవ్వకానికి సంబంధించి విజయరాయి రీచ్‌కు అ నుమతులు ఉన్నాయని, తాజాగా వివాదం జరిగిన ప్రాంతం కూడా ఈ రీచ్‌ పరిధిలోనే ఉందని, అంత కు మించి ఇదంతా పశ్చిమగోదావరి జిల్లాలోనే ఉందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+