గంటా సంచలనం: పోటీపై బాబుదే నిర్ణయం, ఆ ప్రకటన వెనుక వ్యూహమిదే

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖపట్టణం: 2019 ఎన్నికల్లో ఎక్కడి నుండి పోటీ చేయాలనే విషయమై పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిర్ణయిస్తారని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.గురువారం నాడు మంత్రి గంటా శ్రీనివాసరావు చోడవరంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.

విశాఖ జిల్లాలోని భీమిలి నుండి ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుండి పోటీ చేస్తారనే విషయమై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఎన్నికల సమయంలో సురక్షితమైన అసెంబ్లీ స్థానాన్ని ఎంపిక చేసుకొని పోటీ చేయడంలో గంటా శ్రీనివాసరావు చాలా జాగ్రత్తలు తీసుకొంటారనే ప్రచారం కూడ లేకపోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అనకాపల్లి నుండి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం భీమిలి నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

 చర్చకు తెరలేపిన గంటా శ్రీనివాసరావు

చర్చకు తెరలేపిన గంటా శ్రీనివాసరావు

విశాఖ జిల్లా చోడవరంలో మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చకు తెరతీశాయి. వచ్చే ఎన్నికల్లో తాను చోడవరం నుండి పోటీ చేస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు.గతంలో చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహించారు.అయితే మీడియా ప్రతినిధుల ప్రశ్నకు మంత్రి గంటా శ్రీనివాసరావు ఇచ్చిన సమాధానం రాజకీయాల్లో చర్చకు తెరతీసింది.

 ఎక్కడి నుండి పోటీ చేయాలో బాబు నిర్ణయిస్తాడు

ఎక్కడి నుండి పోటీ చేయాలో బాబు నిర్ణయిస్తాడు

వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడి నుండి పోటీ చేయాలనే విషయమై టిడిపి అధినేత చంద్రబాబునాయుడు నిర్ణయిస్తారని మంత్రి గంటా శ్రీనివాసరావు కొందరు మీడియా ప్రతినిధులకు చెప్పారు. తాను ఎక్కడి నుండి పోటీ చేస్తాననే విషయమై చర్చ సాగుతోందని ఆయన చెప్పారు. ఎక్కడి నుండి పోటీ చేస్తాననే విషయమై బాబు తేలుస్తారని ఆయన చెప్పారు.

పోటీపై ఎందుకు చర్చ

పోటీపై ఎందుకు చర్చ

మంత్రి గంటా శ్రీనివాసరావు తరచూ నియోజకవర్గాలు మారుతుంటారు. వచ్చే ఎన్నికల్లో కూడ గంటా శ్రీనివాసరావు నియోజకవర్గం మారే అవకాశాలున్నాయనే ప్రచారం కూడ సాగుతోంది. ఈ ప్రచారం మేరకు అసెంబ్లీ నియోజకవర్గం గంటా శ్రీనివాసరావు మారే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. చోడవరం, భీమిలి, విజయనగరం జిల్లా నెల్లిమర్ల అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. దీంతో గందరగోళం నెలకొంది.

భీమిలి నుండే పోటీ

భీమిలి నుండే పోటీ

వచ్చే ఎన్నికల్లో భీమిలి నుండి పోటీ చేస్తానని కూడ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. అయితే కొందరు తాను ఎక్కడి నుండి పోటీ చేస్తాననే విషయమై తప్పుడు ప్రచారం చేస్తున్నందున ఈ విషయమై అలా మాట్లాడాల్సి వచ్చిందని గంటా శ్రీనివాసరావు మీడియాకు వివరించారు. మరో వైపు చివరగా ఈ విషయాలను నిర్ణయించాల్సిందే చంద్రబాబేనని గంటా శ్రీనివాసరావు తేల్చి చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP Education Minister Ganta Srinivasa Rao said that party chief Chandrababu Naidu will decide segment for me to contest in 2019 elections .He spoke to media on thursday at Chodavaram

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి