పదేళ్లకు నవ్విన బాబు! జగన్ బేజారు, కారు జోరు
న్యూఢిల్లీ: సీమాంధ్రలో తెలుగుదేశం, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు దూసుకెళ్తున్నాయి. సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ టిడిపికి పోటీ ఇచ్చినప్పటికీ సైకిల్ హవా కనిపిస్తోంది. పదేళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు విభజిత ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన మెజార్టీ కనిపిస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. సీమాంధ్రలోని పార్టీ కార్యాలయాల్లో, హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 63, టిడిపి 105, బిజెపి 4 స్థానాల్లో ముందంజలో ఉంది. లోకసభ స్థానాల విషయానికి వస్తే టిడిపి 13, బిజెపి 3, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 9 స్థానాల్లో ముందంజలో ఉంది.
తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర సమితికి స్పష్టమైన ఆధిక్యం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు తెరాస 66, కాంగ్రెసు 22, టిడిపి, బిజెపి కూటమి 22, మజ్లిస్ 6 స్థానాల్లో ముందంజలో ఉంది. లోకసభ విషయానికి వస్తే తెరాస 11, కాంగ్రెస్ 2, బిజెపి, టిడిపి కూటమి 2, మజ్లిస్ 1, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 1 స్థానంలో ముందంజలో ఉంది.
-
కొద్దిసేపు మాట్లాడుకున్న రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ.. వీడియో వైరల్ -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి












Click it and Unblock the Notifications