'చంద్రబాబు అద్భుతాలు చూస్తుంటే జగన్‌కు నిద్రపట్టడం లేదు'
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మంత్రి పత్తిపాటి పుల్లారావు సోమవారం నాడు మండిపడ్డారు.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మంత్రి పత్తిపాటి పుల్లారావు సోమవారం నాడు మండిపడ్డారు. జగన్‌కు కేసులు, సూటుకేసుల గురించి తప్ప రైతుల కష్టాలు తెలియవని ఎద్దేవా చేశారు.
అధికార దాహంతో జగన్ రైతు భరోసా యాత్రలు చేస్తున్నారన్నారు. ప్రజల పైన ప్రేమతో మాత్రం ఆయన యాత్రలు చేయడం లేదన్నారు. ఏపీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అద్భుతాలు చూస్తుంటే జగన్‌కు నిద్రపట్టడం లేదన్నారు.

ఓదార్పు యాత్ర పేరుతో జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతులకు రుణమాఫీ, గిట్టుబాటు ధర కల్పించామన్నారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చాయన్నారు. కోర్టుల చుట్టూ తిరిగే వారికి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదన్నారు.












Click it and Unblock the Notifications