బాబు నంద్యాల సర్వేలో మరో షాక్: అఖిల ప్లాన్‌‌పై దెబ్బ, జగన్ సీరియస్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌లు నంద్యాల ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఎన్నికలను ఏకగ్రీవం చేయడం లేదా గెలవడం కోసం టిడిపి, పోటీ చేసి గెలవాలని వైసిపి పట్టుదలతో ఉన్నాయి.

చదవండి: వైసిపి ప్రకటనతో అఖిలప్రియ ఆశ్చర్యం

నంద్యాలలో తమ పార్టీ తరఫున ఎవరిని బరిలోకి దింపాలనే అంశంపై చంద్రబాబు సర్వే చేయిస్తున్నారు. ఈ సర్వేలో శిల్పా మోహన్ రెడ్డికి, భూమా కుటుంబానికి దాదాపు సమానంగా ఫలితం వచ్చిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు శాంపిల్స్ తీసుకోవాలని నిర్ణయించారు.

చంద్రబాబుకు ఇబ్బందికరమే

చంద్రబాబుకు ఇబ్బందికరమే

మొత్తానికి అభ్యర్థి ఎంపిక చంద్రబాబుకు ఇబ్బందికరంగానే మారింది. సర్వేలు ఇరువురు నేతలకు సమానంగా ఫలితాలు రావడంతో పాటు మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయని తెలుస్తోంది. భూమా పార్టీ మారినా ఇంకా కొంత కేడర్ వైసిపితోనే ఉన్నట్లు గుర్తించారు.

జగన్ సీరియస్‌గా..

జగన్ సీరియస్‌గా..

మరోవైపు, జగన్ కూడా ఈ ఉప ఎన్నికను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. అదే సమయంలో ఏకగ్రీవం కోసం టిడిపి చేస్తున్న ప్రయత్నాలు ఆయనకు ఆగ్రహం తెప్పిస్తున్నాయని సమాచారం.

విజయమ్మ నుంచి హామీ అయితే రాలేదు

విజయమ్మ నుంచి హామీ అయితే రాలేదు

కాటసాని రాంరెడ్డి ద్వారా అఖిలప్రియ ఏకగ్రీవం కోసం రాయబారం నెరపినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. విజయమ్మతో చర్చలు జరిపారని ప్రచారం జరిగింది. కానీ విజయమ్మ నుంచి అఖిలకు ఎలాంటి హామీ రాలేదు.

జగన్ జీర్ణించుకోలేకే..

జగన్ జీర్ణించుకోలేకే..

నంద్యాలపై జగన్ సీరియస్‌గా ఉండటం వల్లనే ఎలాంటి హామీ రాలేదని అంటున్నారు. జిల్లాలో తనకు అండగా ఉంటారని భావించిన భూమా ఫ్యామిలీ తనను వదిలి వెళ్లిపోవడం జీర్ణించుకోలేని జగన్ భూమా ఫ్యామిలీ బరిలోకి దిగినా పోటీకే సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. వైసిపి పోటీకే సిద్ధమవడంతో టిడిపి కూడా ఏకగ్రీవం ప్రయత్నాలను విరమించిందని అంటున్నారు.

బాబు ఎవరి వైపు మొగ్గు చూపుతారో

బాబు ఎవరి వైపు మొగ్గు చూపుతారో

ఇక, టిడిపిలో శిల్పా మోహన్ రెడ్డి, అఖిల సోదరుడు బ్రహ్మానంద రెడ్డి రేసులో ఉన్నారు. వీరి ఇరువురిపై చంద్రబాబు సర్వే చేయిస్తున్నారు. ఎప్పటికప్పుడు సర్వే నివేదికలు తెప్పించుకుంటున్న చంద్రబాబు చివరకు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
andhra pradesh cm Chandrababu Naidu and YSR Congress Party chief YS Jaganmohan Reddy very serious on nandyal bypoll.
Please Wait while comments are loading...