జనం ఓట్లేయకపోతే ఏం లాభం, సర్వే ఆధారంగానే టిక్కెట్లు, తమ్ముళ్ళకు బాబు షాక్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి:ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ పథకాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో మంత్రులు,ఎమ్మెల్యేలు వైఫల్యం చెందారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఎన్ని చేసినా పార్టీకి ఓట్లు వేయకపోతే ఏం లాభమని ఆయన పార్టీ నాయకులకు సూచించారు.ఈ పరిస్థితిలో మార్పు రావాలని ఆయన పార్టీ నాయకులకు సూచించారు.

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత చంద్రబాబునాయుడు అమరావతిలో టిడిఎల్పీ సమావేశాన్నినిర్వహించారు చంద్రబాబునాయుడు.

ఈ సమావేశంలో పార్టీని బలోపేతం చేసేందుకుగానుతీసుకోవాల్సిన చర్యలపై ఆయన మంత్రులకు, ఎమ్మెల్యేలకు దిశానిర్ధేశం చేశారు. పార్టీ కమిటీలను పూర్తి చేయాలని ఆయన సూచించారు.

ఎన్ని కార్యక్రమాలను పూర్తిచేసినా ప్రజలుర ఓట్లేయకపోతే ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు.క్షేత్రస్థాయిలో పార్టీ కమిటీలు సక్రమంగా పనిచేయాల్సిన అవసరాన్ని చంద్రబాబునాయుడు సూచించారు.

ప్రజలు ఓట్లేయకపోతే లాభం లేదు

ప్రజలు ఓట్లేయకపోతే లాభం లేదు

రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది.అయితే ఈ పథకాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో పార్టీ యంత్రాంగం వైఫల్యమైందని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.ప్రజల కోసం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా కాని, వాటిని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్ళకపోతే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని బాబు చెప్పారు.


ఈ విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అనే తేడా లేదన్నారు. ఇప్పటికైనా పరిస్థితుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని బాబు పార్టీ నాయకులకు హితవు పలికారు.ఎన్ని చేసినా ప్రజలు ఓట్లేయకపోతే లాభమేమిటని ఆయన ప్రశ్నించారు. ప్రజల వద్దకు వెళ్ళి పార్టీకి ఓటు వేయించే పరిస్థితి లేకపోతే నష్టమని చెప్పారు.

ఐవిఆర్ఎస్ ద్వారా టిక్కెట్ల కేటాయింపు

ఐవిఆర్ఎస్ ద్వారా టిక్కెట్ల కేటాయింపు

వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు విషయమై ఐవిఆర్ఎస్ సర్వే ద్వారా టిక్కెట్ల కేటాయించనున్నట్టు చంద్రబాబునాయుడు ప్రకటించారు.2014 ఎన్నికల సమయంలో కూడ చంద్రబాబునాయుడు ఐవిఆర్ఎస్ ద్వారా టిక్కెట్లను కేటాయించారు. అభ్యర్థుల ఎంపిక కోసం చంద్రబాబునాయుడు ఈ సర్వే ఆధారంగా టిక్కెట్లను కేటాయించారు. అయితే రానున్న ఎన్నికల్లో కూడ ఇదే తరహాలోనే టిక్కెట్లను కేటాయించనున్నట్టు బాబు చెప్పారు. అయితే పార్టీ కోసం పనిచేయడంతో పాటు. ప్రజల్లో ఉన్నవారికే సర్వేలో స్థానం దక్కనుంది.అందుకే ప్రజల మధ్యే ఉండాలని బాబు పార్టీ నాయకులకు చెప్పారు బాబు.

డబ్బున్నవాళ్ళంతా సుఖంగా ఉండరు

డబ్బున్నవాళ్ళంతా సుఖంగా ఉండరు

డబ్బున్నవాళ్ళంతా సుఖంగా ఉండరని బాబు చెప్పారు. అయితే తృప్తిగా ఉన్నవారే జీవితంలో సుఖంగా ఉంటారని బాబు చెప్పారు. అందుకే అసెంబ్లీలో చెప్పిన మాటను ఆయన మరోసారి బాబు చెప్పారు.ఆరు రకాల అ, ఆ లు గురించి చంద్రబాబునాయుడు మరోసారి టిడిఎల్పీ సమావేశంలో చెప్పారు. అ అంటే అమరావతి, ఆ అంటే ఆదాయం, అ అంటే అమ్మ, ఆ అంటే ఆంధ్రప్రదేశ్,ఆ అంటే ఆరోగ్యమని బాబు చెప్పారు.

అందితే జుట్టు, లేకపోతే కాళ్ళు పట్టుకోవడం జగన్ నైజం

అందితే జుట్టు, లేకపోతే కాళ్ళు పట్టుకోవడం జగన్ నైజం

అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనేది వైసీపీ అధినేత జగన్ నైజమని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోనియాతో పోరాటమని చెప్పిన చంద్రబాబునాయుడు బెయిల్ కోసం సోనియా కాళ్ళు పట్టుకొన్నారని బాబు ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో రాజీనామా చేయిస్తానని ప్రకటించిన బాబు ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ దగ్గరకు వెళ్ళి మద్దతు ప్రకటించారని బాబు చెప్పారు. జగన్ తీరును ప్రజలు అర్ధం చేసుకొంటారని చెప్పారు.రైతులకు 1500 బోనస్ ఇచ్చిన విషయాన్ని ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాలని చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhrapradesh chiefminister Chandrababunaidu warned to mnisters and mlas on Tuesday in Tdlp meeting. party leaders should publicity on welfare schemes he said.
Please Wait while comments are loading...