ఎవరెస్టుపై ఎగిరిన టీడీపీ జెండా -80 ఏళ్ల వయసులో: మురిసిపోయిన చంద్రబాబు..!!
80 ఏళ్ల వయసు. 5000 మీటర్ల ఎత్తు. ఎవరెస్టు శిఖరం పైన టీడీపీ జెండా. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 80 ఏళ్ల గింజుపల్లి శివప్రసాద్ అనే వృద్ధుడు ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. అక్కడ నుంచి చంద్రబాబు గెలుపు అవసరాన్ని వివరిస్తూ సందేశం ఇచ్చారు. దార్శనికుడు.. రాస్ట్రాన్ని సక్రమంగా పరిపాలించగలిగే నాయకుడైన చంద్రబాబును మళ్లీ అంధ్రప్రదేశ్ గద్దెపై కూర్చోబెట్టాలంటూ గింజుపల్లి శివప్రసాద్ పిలుపునిచ్చారు.
ఎవరెస్టుపై టీడీపీ - చంద్రబాబు కోసం
హిమాలయాల్లో అత్యంత ఎతైన శిఖరంగా పేరుగాంచిన మౌంట్ ఎవరెస్ట్ పైన ఆయన టీడీపీ ఫ్లెక్సీతో తాను చెప్పదలచుకున్నది స్పష్టం చేసారు. పార్టీ పైనా - అధినేత చంద్రబాబు పైన శివ ప్రసాద్ తనకున్న అభిమానం చాటుకుంటూ..అక్కడి నుంచే వీడియో సందేశం విడుదల చేసారు. అందులో తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా మీ రాష్ట్రాన్ని..దేశాన్ని మర్చిపోకండంటూ సూచించారు. ప్రస్తుతం మీ రాష్ట్రం చాలా ఇబ్బదుల్లో -దయనీయ పరిస్థితుల్లో ఉందని చెప్పుకొచ్చారు.

చంద్రబాబును గెలిపించండంటూ
అందరికీ చెప్పి చంద్రబాబును గద్దెపై కూర్చోబెట్టండి..రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటూ సూచించారు. ఇప్పుడు టీడీపీ అభిమానుల్లో..పార్టీ శ్రేణుల్లో ఈ వీడియో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతోంది. శివ ప్రసాద్ టీడీపీ జెండాతో ఎవరెస్ట్ అధిరోహించటం పైన చంద్రబాబు స్పందించారు. తన ట్విట్టర్ ఖాతాలో ఆ వీడియోను పోస్టు చేసారు. ఆ వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని 5 వేల మీటర్ల ఎత్తు వరకు అధిరోహించి.. అక్కడ టిడిపి ఫ్లెక్సీని ప్రదర్శించారని అభినందించారు.

చంద్రబాబు ప్రశంసలు
తాను గతంలో 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర చేపట్టానని తెలిపిన చంద్రబాబు... ఆ పాదయాత్రలో శివప్రసాద్ తనతో కలిసి అడుగులేశారని గుర్తు చేసుకున్నారు. సంకల్పం ఉంటే ఏదీ అసాధ్యం కాదని నిరూపించి యువతకు ఆదర్శంగా నిలిచారని శివప్రసాద్ ను ప్రశంసించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎలాగైనా అధికారంలోకి రావాలని కోరుకుంటున్న అభిమానులు భిన్న మార్గాల్లో ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఇప్పుడు 80 ఏళ్ల వయసులో శివప్రసాద్ చేసిన సాహసం పార్టీ శ్రేణుల్లో ఆసక్తి కర చర్చకు కారణమైంది.












Click it and Unblock the Notifications