చంద్రబాబు సొంత ఊరు, నాని దెబ్బకు చెవిరెడ్డి మైండ్ బ్లాక్, రూ, వందల కోట్ల లెక్కలు చెప్పండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టిపెరిగిన నియోజక వర్గం చంద్రగిరిపై సీఎం ఫోకస్ పెట్టారు. చంద్రగరిలో వైసీపీ జెండా ఎగరవేసి, జగన్ సీఎం అయిన తరువాత చక్రం తిప్పి చంద్రగిరి నియోజక వర్గంలో టీడీపీ కార్యకర్తలకు నిద్రలేకుండా చేసిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చుక్కలు చూపించడానికి టీడీపీ సిద్దం అయ్యింది
చంద్రగిరి నియోజక వర్గంలో చంద్రబాబు అండతో పులివర్తి నాని ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చాలా ఏళ్ల తరువాత చంద్రగిరి నియోజక వర్గంలో టీడీపీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఇలాంటి సమయంలో తుడా నిధులతో చంద్రగిరి నియోజక వర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల జాబితా ఇవ్వాలని, ఎక్కడెక్కడ ఎన్ని కోట్ల రుపాయల నిధులతో అభివృద్ధి చేశారు అని లెక్కలు చెప్పాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తుడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

తిరుపతి నగరపాలక కార్యాలయంలో వీసి వెంకటనారాయణ చాంబర్ లోకి ఎంట్రీ ఇచ్చిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని వీసీతో సహ తుడా అధికారులతో సమావేశం అయ్యారు. ఇదే సమయంలో పలు రికార్డులు పరిశీలించిన టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అధికారులను తుడాకు సంబంధించి లెక్కలు అడగడంతో ఆ అధికారులు బిక్క ముఖం వేశారని తెలిసింది.
తుడా జీతాలు తీసుకుంటూ అప్పటి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కార్యాలయం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కార్యాలయంలో పని చేసిన ఉద్యెగుల జాబితా ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని తుడా అధికారులకు సూచించారు. తుడాలో జీతాలు తీసుకుని వైసీపీ నాయకుల కార్యాలయాల్లో పని చేసిన వారు ఎవరు ?, వారు ఎంత కాలం వైసీపీ కార్యాలయాల్లో పని చేశారు, ఎంతెంత జీతాలు తీసుకున్నారు అనే మొత్తం సమాచారం ఇవ్వాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తుడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తిరుపతి సమీపంలోని, చంద్రగిరి పరిధిలోని తుమ్మలగుంట చెరువు కోసం వినియోగించిన నిధులు, ఎంపీడీవోలకు ఇప్పటి వరకు తుడా నిధులు విడుదల చేశారని, ఆ నిధులు ఎక్కడెక్కడ ఎలా ఖర్చు చేశారు అనే పూర్తి సమాచారం ఇవ్వాలని పులివర్తి నాని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎంపీడీవోలకు ఇంతకాలం ఇచ్చిన రూ. 273 కోట్ల తుడా నిధుల లెక్కలు పిన్ టూ పిన్ చెప్పాలని, రికార్డులు మొత్తం తన ముందు పెట్టాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తుడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తుడా ఛైర్మన్ గా పని చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పినట్లు తల ఊపిన అధికారుల జాతకాలు మొత్తం తనముందు పెట్టాలని, ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత కూడా ఎంపీడీవోల అకౌంట్లకు రూ. 19 కోట్లు నిధులు ఎందుకు విడుదల చేశారో చెప్పాలని చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని తుడా అదికారులను నిలదీశారని వెలుగు చూసింది.
చంద్రగిరికి చెందిన చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండటం, చంద్రగిరిలో టీడీపీ గెలవడం, చెవిరెడ్డి ఫ్యామిలీ రెండు చోట్ల ఓడిపోవడంతో ఇప్పుడు తుడా లెక్కలు బయటకు తీసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చుక్కలు చూపించాలని టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని డిసైడ్ అయ్యారని తెలిసింది. ఇదే సమయంలో తుడా అవకతవకలపై కూడా విచారణ జరిపించానలి సీఎం చంద్రబాబుకు మనవి చెయ్యాలని పులివర్తి నాని సిద్దం అవుతున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications