చంద్రయాన్ 3 వ్యోమనౌకకు కూకట్‌పల్లి నుండి విడిభాగాలు!!
భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా జాబిల్లిపై పరిశోధనలను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారతదేశం చంద్రయాన్ 1 రూపంలో చేపట్టిన తొలియత్నం లో అద్భుతమైన విషయాలను ప్రపంచానికి తెలియజేసింది. చంద్రయాన్ 2 అనుకున్న మేరకు సక్సెస్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ చంద్రయాన్ 3 పేరుతో ఇప్పటి దాకా చంద్రుడిపై ఎవరు వెళ్ళని దారులకు, ఎవరు చూడని దక్షిణ ధృవాన్ని చూడడానికి, అక్కడి నిగూఢమైన రహస్యాలను ఛేదించడానికి ఇస్రో శ్రీకారం చుట్టింది.
Recommended Video

రేపు శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి భారత వ్యోమనౌక చంద్రయాన్ 3 నింగిలోకి దూసుకుపోనుంది. బాహుబలి రాకెట్ గా గుర్తింపు పొందిన ఎల్వీఎం 3 ఎం4 దీనిని మోసుకు వెళ్లనుంది. అయితే చంద్రయాన్ 3 కోసం వినియోగించే వ్యోమ నౌకలో తెలంగాణా లోనూ కొన్ని విడిభాగాలను తయారు చేయించి వినియోగించారు.

కూకట్‌పల్లి ప్రశాంత్ నగర్‌లోని నాగసాయి ప్రెసెసియన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చంద్రయాన్-3లో వినియోగించిన కొన్ని విడి పరికరాలను తయారుచేసింది. రోవర్, ల్యాండర్, ప్రొపల్షన్ మాడ్యుల్స్‌లో బ్యాటరీలు ఏర్పాటు చేసుకునే విడి భాగాలను కూకట్పల్లిలోనే తయారు చేశారు . కంపెనీ యజమాని డీఎన్ రెడ్డి 1998నుంచి ఇస్రో ప్రయోగించిన 50శాటిలైట్లలో పలు విడి భాగాలు అందిస్తూ వచ్చారు. ప్రస్తుతం చంద్రయాన్ 3 కి కూడా ఆయన పలు విడిభాగాలను అందించారు.
ఇదిలా ఉంటే ఇప్పటివరకు చంద్రుడిపైకి వెళ్లిన వ్యోమ నౌకలు ఎక్కువశాతం అక్కడ మధ్య రేఖ ప్రాంతంలోనే దిగాయి. అయితే ఇప్పుడు భారతదేశం మాత్రం చంద్రయాన్ 3 కోసం ఇప్పటివరకు ఎవరు వెళ్ళని, ఎవరు చూడని దక్షిణ ధృవం వైపు వెళ్లనుంది. దక్షిణ ధృవం లోని భౌతిక పరిస్థితులు చాలా ప్రత్యేకంగా ఉండడంతో అక్కడ పరిశోధన చేయాలని భారత్ ప్రయత్నిస్తుంది.
వందల కోట్ల ఏళ్లుగా దక్షిణ ధ్రువ ప్రాంతంలోని కొన్ని భాగాలు శాశ్వతంగా చీకట్లోనే ఉన్నాయని, అక్కడ సూర్యకాంతి పడలేదని, అందువల్ల అక్కడ మూలకాలు సౌర రేడియో ధార్మికత కారణంగా తలెత్తే మార్పులకు లోనుకాకుండా ఉంటాయని వాటిని పరిశోధిస్తే విశ్వానికి సంబంధించిన అనేక రహస్యాలు తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications