జగన్‌కు షాక్: లిక్కర్ మాఫియాలో వైసీపీ ఎమ్మెల్యేలు
నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకోని షాక్ తగిలింది. కల్తీ మద్యం కేసులో నెల్లూరు జిల్లా సర్వేపల్లి , కావలి ఎమ్మెల్యేలు కాకాణి గోవర్థన్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాపరెడ్డిలను నిందితులుగా సీఐడీ తేల్చింది. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు.
ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి భారీ ఎత్తున కల్తీ మద్యం తెచ్చినట్లు తేలింది. కాగా, ఈ మొత్తం వ్యవహారం సంచలనమైంది. లిక్కర్ మాఫియా ద్వారా ఎక్సైజ్ శాఖకు ఎలాంటి సుంకం చెల్లించకుండా హాలోగ్రామ్‌లు మార్చి కల్తీ మద్యం జిల్లాకు ఎమ్మెల్యేల అనుచరులు తీసుకువచ్చినట్లు విచారణలో గుర్తించారు.

ఎక్సైజ్ శాఖ దాడుల్లో పట్టుబడిన మద్యం సీసాలను ప్రయోగశాలలో పరిశీలిస్తే దీన్ని సేవించటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నివేదిక వచ్చింది.
అక్రమ మద్యం సరఫరా వ్యవహారంలో బెంగళూరుకు చెందిన లిక్కర్ మాఫియా రాజేంద్ర నిర్మల్ కుమార్, పాండిచ్చేరికి చెందిన సురేష్, ఎర్రచందనం కేసులో పేరు మోసిన నిందితుడు కృష్ణస్వామి అలియాస్ అప్పు నిందితులుగా సీఐడీ విచారణలో తేలింది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోవర్థన్‌రెడ్డి అనుచరుడు, నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు శ్యాంప్రసాద్ రెడ్డి మద్యం మాఫియా ద్వారా నకిలీ మద్యాన్ని ఓటర్లకు పంచటానికి తెప్పించినట్లు సీఐడీ ఆధారాలను సేకరించింది. వైసీపీ నేతలకు వీరితో సంబంధాలు ఉన్నాయని గుర్తించి మొత్తం 11 కేసులు నమోదు చేశారు.
కాగా, ఆరు కేసుల్లో కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి నిందితుడిగా, నాలుగు కేసుల్లో కాకాణి గోవర్థన్‌రెడ్డి , మరోకేసులో శ్యాంప్రసాద్‌రెడ్డిని నిందితులుగా చేర్చుతూ ఏపీ ఎక్సైజ్ చట్టం సెక్షన్ 34(ఎ), 37(ఎ3), 420, 487, 120బి అభియోగాల కింద సీఐడీ చార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఛార్జ్‌షీట్ తయారు చేసి కోర్టులో దాఖలు చేసినట్లు సీఐడీ ఎస్పీ అమ్మిరెడ్డి వెల్లడించారు. అయితే, ఈ కేసులో అరెస్టు కాకుండా ఉండేందుకు గోవర్థన్‌రెడ్డి 28 ఏప్రిల్, 2016న హైకోర్లు నుంచి ముందస్తు బెయిల్‌ను తీసుకున్నారు.












Click it and Unblock the Notifications