ఏపీకి రైల్వే గుడ్ న్యూస్ - వందేభారత్ పొడిగింపు..!!

ఏపీలో వందేభారత్ మరింతగా అందుబాటులోకి రానుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నాలుగు వందేభారత్ రైళ్లు నిర్వహిస్తున్నారు. త్వరలో వందేభారత్ స్లీపర్ ప్రారంభం కానుంది. ఈ సమయంలో ఏపీలో ప్రయాణీకుల నుంచి వస్తున్న వినతుల మేరకు రైల్వే శాఖ తాజా ప్రతిపాదలు సిద్దం చేసింది. ఈ మేరకు ప్రస్తుతం చెన్నై - విజయవాడ మధ్య నడుస్తున్న వందేభారత్ ను భీమవరం వరకు పొడిగించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.

భీమవరం వరకు పొడిగింపు
ప్రస్తుతం చెన్నై-విజయవాడల మధ్య నడుస్తున్న వందేభారత్‌ను భీమవరం వరకు పొడిగించనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలు చేయగా ఈ వందేభారత్ ట్రైన్ భీమవరం వరకు రానుంది. జులై నెలలో ఈ రైలు భీమవరం స్టేషన్ వరకు రానుంది. ఈ వందే భారత్ ట్రైన్ (20677) చెన్నైలో ఉదయం 5.30కి బయలుదేరుతుంది. విజయవాడకు మధ్యాహ్నం 12.10 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు (20678) అక్కడి నుంచి తిరిగి 3.20కి చెన్నై వెళుతుంది. ఈ రైలు విజయవాడ స్టేషన్‌లో దాదాపు 3.10 గంటలు నిలిచిపోతుంది. ఈ రైలు కోసం ప్రత్యేకంగా ఒక ప్లాట్‌ఫాం కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది.

Cheanni - Vijayawada Vandebharat to extend Bhimavaram soon as reports

చెన్నైకు వేగంగా
విజయవాడ జంక్షన్‌లో రైళ్ల రద్దీ దృష్యా ప్రత్యేకంగా ఒక ప్లాట్‌ఫాం కేటాయించడం కష్టంగా మారింది. దీనివల్ల ఆనేక రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీన్ని ఆధిగమించేందుకు దక్షిణ మధ్య రైల్వే వందేభారత్‌ రైలును భీమవరం వరకు పొడిగించాలని ప్రతిపా దించింది. దానికి చెన్నై రైల్వే కూడా అను మతి ఇవ్వడంతో జిల్లాలో వందేభారత్‌ కూత వినిపించనుంది. విజయవాడ నుంచి గంటలో భీమవరం చేరుకుంటుంది. తిరిగి ఇక్కడ నుంచి 2 గంటలకు బయలుదేరి విజయవాడ వెళ్లే విధంగా షెడ్యూల్‌ చేశారు. చెన్నై వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా రాత్రి 10 గంటలకు సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ చేరుకుంటుంది.

భారీ ఊరట
ప్రస్తుతం జిల్లా నుంచి చెన్నైకు సర్కార్‌ మాత్రమే నడు స్తోంది. ఇది కూడా కాకినాడ నుంచి బయలు దేరి తణుకు, భీమవరం, ఆకివీడు మీదుగా వెళ్లుతుంది. దూర ప్రాంతం నుంచి రావ డంతో ఈ రైలులో టిక్కెట్లు దొరకడమే కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో పగటి పూట వందేభారత్‌ వస్తుండటంతో ఒంగోలు, నెల్లూరు మీదుగా చెన్నై ప్రయాణికులకు కొంత ఊరట లభించనుంది. విజయవాడ- నరసాపురం మధ్య డబ్లింగ్‌ లైన్‌ పనుల్లో భాగంగా ఒక లైన్‌ కొత్త ట్రాక్‌ వేశారు. అంతకు ముందు మొదటి లైన్‌లో ఉన్న పాత ట్రాక్‌ను కూడా మార్చడంతో రెండు లైన్లలోనూ వందేభారత్‌ దూసుకెళ్లే విధంగా పనులు పూర్తి చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+