వైసీపీకి ఎదురొడ్డి నిలిచిన వీరనారి... చేరెడ్డి మంజుల

ఏపీలో జరిగిన ఎన్నికలు కురుక్షేత్ర రణరంగాన్ని తలపించాయి. బాంబు పేలుళ్లు.. వేట కొడవళ్లతో దాడులు.. కత్తులు, గొడ్డళ్లతో స్వైర విహారం.. వాహనాల ధ్వంసం.. ఇలాంటి అరాచకాల మధ్య ఎన్నికల సమరం ముగిసింది. పల్నాడు జిల్లా రెంటాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అల్లరి మూకలు రెచ్చిపోయాయి. ఆ పార్టీ రిగ్గింగ్ ను అడ్డుకునేందుకు ఝాన్సీ లక్ష్మీబాయిలా ఓ వీరమహిళ ఎదురొడ్డి నిలిచింది. పల్నాడుకు చెందిన నాయకురాలు నాగమ్మ వారసురాలినని నిరూపించింది. ఆమే చేరెడ్డి మంజుల. ప్రత్యర్థుల దాడిలో గాయాలపాలయ్యారు.

రిగ్గింగ్ జరగడం సహజం
ప్రతిసారి ఎన్నికలు జరిగేటప్పుడు తమ గ్రామంలో రిగ్గింగ్ జరగడం సర్వసాధారణమైన విషయంగా మారిపోయిందని, ఈ పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి వచ్చి ఏజంట్ గా కూర్చున్నట్లు మంజుల తెలిపారు. తనపై దాడిచేసినా పోలింగ్ మాత్రం నిస్పక్షపాతంగా జరగాలనే ఉద్దేశంతోనే మొండి ధైర్యంతో వైసీపీ నాయకుల ప్రయత్నాలను అడ్డుకున్నట్లు వెల్లడించారు. అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు గొడ్డలితో ఆమె నుదిటిపై దాడిచేయగా గాయమై రక్తస్రావమవుతున్నా చికిత్స కూడా చేయించుకోకుండా, అధైర్యపడకుండా పోలింగ్ కేంద్రంలో ఏజంటుగానే కూర్చున్నారు.. వైసీపీ రిగ్గింగ్ ను నిలవరించగలిగారు.

chereddy manjula stands against ysrcp conspiracies

నుదుటిపై గొడ్డలితో దాడి
ఎంత ధైర్యం ఉంటే పోలింగ్ ఏజంట్ గా కూర్చుంటారంటూ తమపై దాడికి పాల్పడ్డారని మంజుల తెలిపారు. తన చెంపలపై కొట్టడంతోపాటు గొడ్డలితో నుదుటిపై నరికారు. తన కొడుకుపైనా దాడికి పాల్పడ్డారన్నారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరామని, ఎస్ ఐని పంపుతామని సీఐ చెప్పినప్పటికీ పంపించలేదన్నారు. 30 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు కత్తులు, గొడ్డళ్లతో రోడ్డుపైకి చేరుకొని స్వైరవిహారం చేశారన్నారు.

శిక్ష పడేవరకు పోరాటం
పోలీసులు వచ్చేవరకు బాధను భరిస్తూనే ఉన్నారు. పోలీసులు వచ్చిన తర్వాతే పోలింగ్ కేంద్రం నుంచి గురజాల ప్రభుత్వాస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. ఓ సాధారణ గృహిణి ఎన్నికలు నిస్పక్షపాతంగా జరగాలి.. ఎప్పటినుంచో వస్తున్న రిగ్గింగ్ సాంప్రదాయాన్ని మార్చాలనే లక్ష్యంతో దాడులు చేస్తున్నా వెరవకుండా ఎదురొడ్డి నిలిచిన వీరమహిళగా చేరెడ్డి మంజుల నిలిచారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఆమె పేరు మార్మోగుతోంది. హైదరాబాద్ లో హోటల్ వ్యాపారం చేస్తున్నారు. తమపై దాడిచేసిన ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేయడంతోపాటు వారికి శిక్షలు పడితేనే మిగతా అందరికీ భయం ఉంటుందని, లేదంటే మరోసారి ఇలాంటి దాడులే జరుగుతాయంటున్నారు. వారికి శిక్షలు పడేవరకు పోరాడతానన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+