Chevireddy: ఎట్టకేలకు చెవిరెడ్డి సహా ముగ్గురికి బెయిల్, ఆయనకు నో..!!
ఎట్టకేలకు వైసీపీ ముఖ్య నేత చెవిరెడ్డి భాస్కర రెడ్డికి బెయిల్ లభించింది. మద్యం కేసులో సుదీర్ఘ కాలంగా జైలులో ఉన్న చెవిరెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఏ-1గా ఉన్న రాజ్ కసిరెడ్డి తో కలిసి మద్యం స్కాంలో చెవిరెడ్డి కీలకంగా వ్యవహరించారని సిట్ అభియోగాలు నమోదు చేసింది. జైలు లో ఉన్న చెవిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా, కసిరెడ్డి బెయిల్ పిటీషన్ డిస్మిస్ చేసింది.
వైసీపీ ముఖ్య నేత చెవిరెడ్డి భాస్కర రెడ్డికి బెయిల్ మంజూరైంది. లిక్కర్ కేసులో జూన్ 17వ తేదీన బెంగళూరు లో సిట్ అధికారులు చెవిరెడ్డిని అరెస్ట్ చేసారు. 226 రోజుల తరువాత ఈ కేసులో చెవిరెడ్డికి బెయిల్ దక్కింది. మద్యం కేసులో పలువురు వైసీపీ నేతలను సిట్ అరెస్ట్ చేసింది. ఎంపీ మిథున్ రెడ్డితో సహా పలువురి పాత్ర పైన అభియోగాలు నమోదు చేసింది.

ఇదే కేసులో బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయ్‌రెడ్డికి రెగ్యుర్ బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తాజాగా తిరస్కరించింది. అయితే, అరెస్ట్ నుంచి కొంత కాలం మినహాయింపు ఇచ్చింది. బెయిల్ కోసం ట్రైల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఇక.. ఈ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం జైలులో ఉన్న చెవిరెడ్డితో పాటుగా మరో ఇద్దరికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు... ఏ-1గా ఉన్న రాజ్ కసిరెడ్డి బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది.
మద్యం కేసులో చెవిరెడ్డి పాత్ర పైన సిట్ అనేక అభియోగాలను నమోదు చేసింది. గతంలోనూ పలు సందర్భాల్లో చెవిరెడ్డి తనక మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. అయితే, ఇప్పటి వరకు చెవిరెడ్డికి రిలీఫ్ దక్కలేదు. విజయవాడ జైలులో చెవిరెడ్డి తో పాటుగా శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ల ను తిరస్కరించటంతో.. వీరు హైకోర్టును ఆశ్రయించారు.
ఇప్పుడు వీరికి బెయిల్ మంజూరు అయింది. ఇప్పటి వరకు ఈ కేసులో తొమ్మది మందికి బెయిల్ లభించింది. రాజ్ కసిరెడ్డితో సహా నలుగురు ఇంకా రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇక.. సుప్రీం ఆదేశాల మేరక బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయ్‌రెడ్డి ఇప్పుడు ఏసీబీ కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తాజా పరిణామంతో.. ఈ కేసులో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications