చిత్తూరు జైలుకు చెవిరెడ్డి: స్టేషన్ బెయిల్ ఇవ్వదగ్గ కేసుపై బాబు కక్ష

Posted By:
Subscribe to Oneindia Telugu

చిత్తూరు: చిత్తూరు జిల్లా సబ్ కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసనకు దిగిన ఘటనలో చంద్రగిరి వైసిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి న్యాయస్థానం 15 రోజుల రిమాండ్ విధించింది. గురువారం ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ రోజు ఉదయం పుత్తూరు కోర్టులో హాజరు పరిచారు.

న్యాయమూర్తి చెవిరెడ్డికి రిమాండ్ విధించారు. ఆ వెంటనే పోలీసులు ఆయన్ను చిత్తూరు జైలుకు తరలించారు. కేవలం స్టేషన్ బెయిలు ఇవ్వదగ్గ ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు హేయమని ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. చెవిరెడ్డిపై చంద్రబాబు సర్కారు కక్షకట్టిందన్నారు. అక్రమంగా కేసులు బనాయించి వేధిస్తోందని, పోలీసులు ప్రభుత్వ కనుసన్నల్లో ఉంటున్నారన్నారు.

Chevireddy Bhaskar Reddy sent to Chittoor Jail

చంద్రబాబు చెప్పేవి, చేసేవి అన్ని మోసాలేనని వైసిపి నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ధ్వజమెత్తారు. గడపగడపకూ వైసిపి కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం నాడు ప్రారంబించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chevireddy Bhaskar Reddy sent to Chittoor Jail.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి