వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చుక్కలనంటిన చికెన్ ధరలు.. ఏపీ, తెలంగాణాలలో చికెన్ ధరలకు రెక్కలు రావటానికి రీజన్స్ ఇవే !!

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే బలవర్ధకమైన ఆహారం తినాలని పదేపదే డాక్టర్లు చెప్పటంతో ప్రజలు నాన్ వెజ్ వైపు బాగా మొగ్గు చూపిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలు చికెన్ మీద తెగ మక్కువ చూపిస్తున్నారు. దీంతో విపరీతంగా చికెన్ డిమాండ్ పెరిగింది . ఫలితంగా కోడి ధరలు కొండెక్కి కూర్చున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గతంలో ఎన్నడూ లేనంతగా చికెన్ ధరలు పెరిగిపోయాయి.

రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ .. మళ్ళీ ఇండియాకు టెన్షన్ .. తాజా పరిస్థితి ఇదే !!రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ .. మళ్ళీ ఇండియాకు టెన్షన్ .. తాజా పరిస్థితి ఇదే !!

 కొంతకాలంగా ఒడిదుడుకుల్లో సాగిన పౌల్ట్రీ పరిశ్రమ

కొంతకాలంగా ఒడిదుడుకుల్లో సాగిన పౌల్ట్రీ పరిశ్రమ

కరోనా మహమ్మారి తొలి రోజుల్లో ఎవరూ కోళ్ళ వంక చూడలేదు. కానీ ప్రజల్లో కరోనా నుండి బయటపడాలంటే పౌష్టిక ఆహారం తీసుకోవాలన్న చైతన్యం పెరిగిన వేళ చికెన్ తెగ తినటం మొదలైంది. అయితే మళ్ళీ కోళ్ళకు లంపీ స్కిన్ డిసీజ్ , అలాగే కొక్కెర వ్యాధి, ఆ తర్వాత బర్డ్ ఫ్లూ ఎక్కువగా రావటంతో దేశ వ్యాప్తంగా ప్రజలెవరూ చికెన్ వంక చూడలేదు. చికెన్ తినాలంటేనే భయపడ్డారు. ఆ సమయంలో కూడా పౌల్ట్రీ పరిశ్రమ కుదేలైంది. తీవ్ర నష్టాలను చవి చూసింది. ఇక గడిచిన ఎండా కాలంలో కూడా కోళ్ళు పెద్ద సంఖ్యలో మృత్యు వాత పడ్డాయి. దీంతో కోళ్ళ ఉత్పత్తి బాగా తగ్గింది. ఒడిదుడుకుల్లో సాగిన పౌల్ట్రీ పరిశ్రమ మళ్ళీ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుంది.

చికెన్ కు బాగా పెరిగిన డిమాండ్ .. అందుకు తగ్గట్టుగా లేని కోళ్ళ ఉత్పత్తి

చికెన్ కు బాగా పెరిగిన డిమాండ్ .. అందుకు తగ్గట్టుగా లేని కోళ్ళ ఉత్పత్తి

మళ్ళీ ప్రజలు ఇప్పుడు చికెన్ కోసం ఎగబడుతున్న సమయంలో చికెన్ కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. కానీ పౌల్ట్రీ లలో అందుకు తగినట్టు కోళ్ళ సరఫరా లేదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం చికెన్ ధరలు చుక్కలనంటాయి. సామాన్యులకు అందుబాటులో లేనంతగా చికెన్ ధరలు పెరగడం చికెన్ ప్రియులకు ఒకింత నిరాశ కలిగిస్తున్నాయి. చికెన్ ధర ఒక్క వారం రోజుల్లోనే 100 రూపాయలకు పైగా పెరిగింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

 సామాన్యులు కొనుగోలు చేయలేని విధంగా పెరిగిన ధరలు

సామాన్యులు కొనుగోలు చేయలేని విధంగా పెరిగిన ధరలు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో చికెన్ ధర 285 రూపాయలు ఉండగా, మరికొన్ని ప్రాంతాలలో మూడు వందల రూపాయలకు చేరుకుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా చికెన్ ధరలకు రెక్కలు రావడం సామాన్యుల జేబులకు చిల్లులు పడేలా చేస్తుంది. విపరీతంగా పెరుగుతున్న చికెన్ ధరల పై అధికారుల నియంత్రణ లేకపోవడం, ప్రజల డిమాండ్ కు తగ్గట్టుగా సప్లై లేకపోవడం, కరోనా మహమ్మారి ప్రారంభంలో, కోళ్ల కు వివిధ రకాల జబ్బులు వ్యాప్తి చెందిన నేపధ్యంలో తీవ్ర నష్టాలను ఎదుర్కొన్న విక్రయదారులు, పౌల్ట్రీ నిర్వాహకులు ఇప్పుడు ఆ నష్టాల భర్తీపై దృష్టి పెట్టారు.

చికెన్ ధరలకు రెక్కలు రావటానికి ఎన్నో కారణాలు

చికెన్ ధరలకు రెక్కలు రావటానికి ఎన్నో కారణాలు

అందులో భాగంగానే ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని చికెన్ ధరలను విపరీతంగా పెంచేస్తున్నారు. పెరుగుతున్న డిమాండ్ మరియు తక్కువ ఉత్పత్తి కారణంగా కేవలం కొన్ని వారాల్లోనే చికెన్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఇదే సమయంలో కోళ్ళ దాణా ధరలు పెరగటం కూడా ప్రస్తుతంచికెన్ ధరలు పెరగటానికి ఒక కారణంగా చెప్తున్నారు చికెన్ విక్రయదారులు.

English summary
chicken prices in Telugu states are soar at present. Rising chicken prices beyond the reach of the common man are causing some frustration for chicken lovers. The price of chicken has gone up by more than Rs 100 in a single week which means you can understand how the situation is.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X