జూన్ నాటికి రోడ్ల మరమ్మత్తులు పూర్తికావాలి - 46 వేల కిలోమీటర్లు మొత్తం ఒక యూనిట్‌గా : సీఎం జగన్..!!
రాష్ట్రంలో రహదారులన్నీ కూడా తక్షణమే మరమ్మత్తులు చేయాలని..అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. రోడ్ల మరమ్మత్తుల పైన ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో స్పెసిఫిక్ రోడ్లు కాకుండా మొత్తం చేయాలని నిర్దేవించారు. ఎక్కడా ప్యాచ్ కనిపించకూడదని.. మేం అన్ని చేశామనే మెసేజ్ వెళ్ళాలని స్ఫష్టం చేసారు. మేజర్ రోడ్లకు ట్రాఫిక్‌ను బట్టి ఏ మేరకు మరమ్మత్తులు చేయాలనేదానిపై సమావేశంలో అధికారులు వివరించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌ల వివరాలు, పనుల పురోగతిపై అధికారులను సీఎం వివరాలు అడిగారు.
అర్జెంట్ రిపేర్లు చేయాల్సిన పనుల స్టేటస్ అధికారులు వివరించారు. వర్షాల వల్ల పనుల్లో కొంత జాప్యం జరుగుతుందన్న అధికారులు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో రహదారులన్నీ కూడా తక్షణమే మరమ్మత్తులు చేయాలి, అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం స్పష్టం చేసారు. ఏ కేటగిరి అయినా సరే 46 వేల కిలోమీటర్లు వెంటనే రిపేర్ చేయాలని సూచించారు. ఎక్కడా గుంతలు ఉండటానికి వీల్లేదని..మాగ్జిమం డ్యామేజ్ అయిన రోడ్లపై వెంటనే దృష్టిపెట్టండంటూ ఆదేశించారు. రోడ్లు మరమ్మత్తులు చేసిన తర్వాత తేడా కనిపించాలి, ఇంత చేసిన తర్వాత మరొకరు విమర్శించే అవకాశం ఉండకూడదని స్పష్టం చేసారు.

ఈ నెలాఖరికల్లా టెండర్లు పూర్తి చేసి 8268 కిలోమీటర్లు రోడ్ల మరమ్మత్తులు వెంటనే మొదలుపెడుతున్నట్లు అధికారుల వెల్లడించారు. 46 వేల కిలోమీటర్లు మొత్తం ఒక యూనిట్‌గా తీసుకోండని సీఎం సూచించారు. వర్షాలు తగ్గగానే డిసెంబర్ నుంచి జూన్ వరకు అన్ని రోడ్ల మరమ్మత్తులు పూర్తిచేస్తామని అధికారులు వివరించారు. అన్ని బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్‌లు కూడా కవర్ చేయాలని సీఎం నిర్దేశించారు. ఆర్‌వోబీలు, బ్రిడ్జిలు కూడా ఫేజ్ 1 పరిధిలోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందించండని సూచించారు.
మున్సిపాలిటీలలో,కార్పొరేషన్‌లలో కూడా గుంతలు లేని రోడ్లు ఉండాలన్నారు. నాడు నేడు తరహాలో ప్రతీ రోడ్డు కూడా ఫోటోలు ఉండాలి, రోడ్లు రిపేర్ చేసేముందు ఫోటోలు తీయండని సీఎం సూచించారు. తర్వాత రిపేర్ చేసిన తర్వాత కూడా ఫోటోలు తీయాలన్నారు. కొత్త రోడ్ల నిర్మాణం కన్నా ముందు రిపేర్లు, మెయింటెనెన్స్ మీద ముందు దృష్టి పెట్టాలని సీఎం పేర్కొన్నారు. నిధులకు సంబంధించి అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని ఆదేశించారు.
2022 జూన్‌కల్లా రాష్ట్రంలో రహదారులన్నీ కూడా మరమ్మత్తులు పూర్తికావాని టైం ఫిక్స్ చేసారు. పంచాయతీల పరిధిలోని రోడ్ల మరమ్మత్తులు కూడా పూర్తవ్వాలన్నారు. వచ్చే నెలలో కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రానికి వస్తున్న క్రమంలో ఈ లోపు ఏపీకి సంబంధించి పెండింగ్ ప్రాజెక్ట్‌ల వివరాలను ఆయన దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.












Click it and Unblock the Notifications