మానవత్వం చాటుకున్న ముఖ్యమంత్రి జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనలోని మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. ప్రజలందరి నుంచి ప్రశంసలందుకుంటున్నారు. అపాచీ పరిశ్రమను ప్రారంభించేందుకు జగన్ తిరుపతి, శ్రీకాళహస్తి పర్యటించిన సంగతి తెలిసిందే. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్మించిన వకుళమాత ఆలయాన్ని ప్రారంభించారు.

అనంతరం శ్రీకాళహస్తిలో అపాచీ పరిశ్రమ శంకుస్థాపన అయిన తర్వాత కాన్వాయ్ బయలుదేరుతున్న సమయంలో ఒక సంఘటన చోటుచేసుకుంది. శ్రీకాళహస్తికి చెందిన మహేష్ కు ఏడు సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో చేయి విరిగిపోయింది. ఆ తర్వాత కాలు కూడా పనిచేయకపోవడంతో చికిత్స కోసం రూ.7 లక్షలు అవడంతో ఉన్న ఆస్తినంతా ఖర్చుపెట్టేశారు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. మెడికల్ రీ ఎంబర్స్ మెంట్ వస్తే కాస్తంత చేయూతంగా ఉంటుందనే ఉద్దేశంతో వాటికోసం ఎదురుచూస్తున్నారు.

Chief Minister Jagan expressed his humanity

మూడు సంవత్సరాల నుంచి రీఎంబర్స్ మెంట్ రాకపోవడంతో ఏం చేయాలో అర్థంకాక ముఖ్యమంత్రి జగన్ శ్రీకాళహస్తి వస్తున్నారని తెలుసుకొని రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లే రోడ్డుపక్కన మహేష్ దంపతులు నిలబడి ఉన్నారు. కాన్వాయ్ లో ఉన్న ముఖ్యమంత్రి జగన్ వారిని గమనించి బండిని అక్కడే ఆపించారు. సిబ్బందిచేత విషయం తెలుసుకొని వినతిపత్రాలను తీసుకున్నారు. వెంటనే రీఎంబర్స్ మెంట్ అయ్యేలా చూస్తానని వారికి హామీ ఇచ్చారు. దీంతో ఈ విషయంపై సోషల్ మీడియాలో జగన్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+