ఓబనపల్లెలో బాబు, బడిపిలుస్తోంది (ఫోటోలు)

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా పర్యటన సందర్భంగా జిల్లాకు వరాలు కురిపించారు. జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుచేసి తద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని ప్రకటించారు.

అలాగే ముగ్గురాయి, బెరైటీస్ విస్తారంగా ఉన్నాయని, వాటి వినియోగం నిమిత్తం ప్రత్యేక ప్యాకేజి ఇచ్చి సంబంధిత ప్రాంతాలకు ఆదాయంతోపాటు ఆదాయ వనరులు చేకూర్చి జిల్లా అభివృద్ధికి హామీ ఇచ్చారు. ఆర్టీపీపీ మరో యూనిట్ పనిచేసేందుకు పనులు ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.

కడప, ప్రొద్దుటూరు ప్రజల శాశ్వత దాహార్తి తీర్చేందుకు కడప సమీపంలో ఉన్న పెన్నా, చెయ్యేరు ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల నుంచి, కుందు పరివాహక ప్రాంతాల నుంచి ప్రొద్దుటూరుకు నీటిని తెప్పించి శాశ్వత నీటి కరవును పరిష్కరిస్తానని సిఎం స్పష్టం చేశారు.

రైల్వేకోడూరు మండలం ఓబనపల్లెలో పర్యటించిన సందర్భంగా ఓబనపల్లె అభివృద్ధికి కోటి రూపాయలు ప్రకటిస్తూ ఓబనపల్లి ఉన్నత పాఠశాలకు ఐదు తరగతి గదులను, ప్రహరీ మంజూరు చేశారు.

జిల్లాలో విస్తారంగా పండ్లతోటలు ఉండటంతో పండ్లతోటల అభివృద్ధి నిమిత్తం మెగా ఫుడ్‌పార్కును, పుణ్యక్షేత్రాలు అధికంగా ఉన్నందున జిల్లాలో ప్రత్యేకంగా టూరిజం సెక్టార్ జిల్లా అభివృద్ధినిమిత్తం టెర్మినల్‌ను నేత కార్మికులు, చేనేతల అభివృద్ధికోసం టెక్స్‌టైల్ పార్కు, ఆర్టీపిపి మూడవ ఫేస్ ఉత్పత్తికోసం చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

 ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభించిన బాబు

ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభించిన బాబు

కడప జిల్లా రైల్వేకోడూరు మండలం ఓబనపల్లెలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభించిన బాబు.

కడప జిల్లా రైల్వేకోడూరు మండలం ఓబనపల్లెలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభించిన అనంతరం గ్రామ ప్రజలతో మాట్లాడుతున్న బాబు.

ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభించిన బాబు

ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభించిన బాబు

కడప జిల్లా రైల్వేకోడూరు మండలం ఓబనపల్లెలో బడి పిలుస్తోందిరా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్ధులు.

 ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభించిన బాబు

ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభించిన బాబు

కడప జిల్లా రైల్వేకోడూరు మండలం ఓబనపల్లెలో బడి పిలుస్తోందిరా కార్యక్రమంలో సీఎం చంద్రబాబుని సత్కరిస్తున్న టీడీపీ కార్యకర్తలు.

 ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభించిన బాబు

ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభించిన బాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా పర్యటన సందర్భంగా జిల్లాకు వరాలు కురిపించారు.

 ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభించిన బాబు

ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభించిన బాబు

కడప జిల్లా రైల్వేకోడూరు మండలం ఓబనపల్లెలో బడి పిలుస్తోందిరా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్ధులు.

 ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభించిన బాబు

ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభించిన బాబు

ఏం పిల్లలు బాగున్నారా..గుడ్‌మార్నింగ్‌... బ్రేక్‌ ఫాస్ట్‌ అయ్యిందా.. లంచ్‌ అ య్యిందా.. గట్టిగా చెప్పండి మధ్యాహ్నం భోజనం బాగుందా.. బాగుందని టీచర్లు ఏమన్నా చెప్పమన్నారా.. ఆవిధంగా మిమ్మల్ని ప్రిపేర్‌ చేశారా.. బడిపిలుస్తోంది కార్యక్రమానికి ప్రిపేర్‌ అయ్యారా అని సీఎం చంద్రబాబునాయుడు పిల్లలను పలకరించారు.

 ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభించిన బాబు

ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభించిన బాబు

10 తరగతి విద్యార్థిని శివకుమారి మాట్లాడుతూ సార్‌ మీరు ఈ రాష్ర్టాభివృద్ధికి చేస్తున్న కృషి ప్రశంసనీ యం. రాష్ర్టానికి తిరిగి మంచిరోజులు వచ్చా యి అంటూ పొగడ్తలతో మంచెత్తారు.

ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభించిన బాబు

ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభించిన బాబు

సీఎం చంద్రబాబు మాట్లాడుతూ బాగా చెప్పావమ్మా.. బాగా కాన్ఫిడెంటుగా మాట్లాడుతున్నావావు ఆ వి ధంగా ఉండాలి అందరూ చప్పట్లు కొట్టండి. గ్రామ సమస్యలు ఏమన్నా ఉన్నాయా. మీ బ డి సమస్యలు ఉన్నాయా.

 ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభించిన బాబు

ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభించిన బాబు

కడప జిల్లా రైల్వేకోడూరు మండలం ఓబనపల్లెలో బడి పిలుస్తోందిరా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్ధులు.

ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభించిన బాబు

ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభించిన బాబు

కడప జిల్లా రైల్వేకోడూరు మండలం ఓబనపల్లెలో బడి పిలుస్తోందిరా కార్యక్రమంలో విద్యార్ధులు ప్రదర్శనకు ఉంచిన వాటి గురించి శ్రధ్ధగా ఆలకిస్తున్న చంద్రబాబు.

 ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభించిన బాబు

ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభించిన బాబు

కడప జిల్లా రైల్వేకోడూరు మండలం ఓబనపల్లెలో బడి పిలుస్తోందిరా కార్యక్రమంలో విద్యార్ధులు ప్రదర్శనకు ఉంచిన వాటి గురించి వివరాలు అడిగి తెలుసుకుంటున్న చంద్రబాబు.

హంద్రీ, నీవా, సుజల స్రవంతి, గాలేరు-నగరి, తెలుగుగంగ, మైలవరం, పోతిరెడ్డిపాడు, ఆదినిమ్మాయపల్లె తదితర ప్రాజెక్టులను వీలైనంత త్వరలో పూర్తిచేసి ఆ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో రైతుల పొలాలను సస్యశ్యామలం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మైనింగ్, ఖనిజ సంపద కాపాడుతూ తద్వారా ప్రభుత్వానికి ఆదాయం, నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు శాశ్వత చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

జిల్లాలో ఫ్యాక్షనిజం, రౌడీయిజం, గూండాయిజం రూపుమాపి ప్రజలందర్నీ స్వేచ్చాజీవితం గడపేందుకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటూ సంబంధిత ప్రాంతాల్లో వ్యవసాయ అభివృద్ధికి పెద్దపీట వేసేందుకు ప్రత్యేక శ్రద్దతీసుకుంటామని ప్రకటించారు.

పులివెందుల, జమ్మలమడుగు ప్రాంతాలకు తుంగభద్రనీరు తీసుకొచ్చేందుకు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో చర్చించి అక్కడి నుంచి వస్తున్న జనవనరులను జిల్లాకు తెప్పిస్తానని సిఎం పలు మార్లు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+